బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలె

బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలె

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ లోని బిర్భూమ్ జిల్లాలో జరిగిన ఘాతుకంపై బీజేపీ ఎంపీ రూపా గంగూలీ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ఇక ఎంతమాత్రం సేఫ్ కాదని.. ప్రజలు రాష్ట్రాన్ని విడిచి వెళ్తున్నారని చెబుతూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలి. అక్కడ సామూహిక హత్యలు జరుగుతున్నాయి. భయంతో ప్రజలు రాష్ట్రాన్ని వదిలి పారిపోతున్నారు. జీవించేందుకు అనువైన పరిస్థితి లేదు. జనాలకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం కూడా లేదు. ప్రభుత్వం హంతకులను కాపాడుతోంది. ఎన్నికల్లో నెగ్గిన తర్వాత ప్రజల్ని చంపే ప్రభుత్వం బహుశా ఇదొక్కటేనేమో! మనం మనుషులమని గుర్తుంచుకోవాలి. ఇలాంటి రాజకీయాలు అవసరమా’ అని రూపా గంగూలీ ప్రశ్నించారు. 

కాగా, పశ్చిమ బెంగాల్ లోని బిర్భూమ్ జిల్లాలో జరిగిన ఘాతుకం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక టీఎంసీ నేత భాదు షేక్ హత్య తర్వాత జరిగిన హింసాకాండలో భోగ్తుయి గ్రామంలో ఎనిమిది మందిని సజీవదహనం చేశారు. ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. భోగ్తుయి గ్రామంలో చోటు చేసుకున్న అల్లర్లలో దహమైన ఇళ్ల మరమ్మతులకు రూ.2 లక్షల చొప్పున ప్రకటించారు. తొలుత సీఎం మమతా బెనర్జీ రూ.1 లక్ష ప్రకటించగా.. ఆ మొత్తం సరిపోదని బాధిత కుటుంబాలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో నష్టపరిహారాన్ని రూ.2 లక్షలకు పెంచారు. 

మరిన్ని వార్తల కోసం..

పీయూష్ గోయల్‎కు ఎర్రబెల్లి సవాల్

ఆర్టీసీ ఆస్తుల అమ్మకంపై సజ్జనార్ క్లారిటీ

ఇకపై మదర్సాల్లోనూ జాతీయ గీతం పాడినంకే క్లాసులు