గెస్ట్ హౌస్ ను క్యాంపు ఆఫీస్గా ఎలా మారుస్తారు..? : నాగం వర్షిత్ రెడ్డి

గెస్ట్ హౌస్ ను క్యాంపు ఆఫీస్గా ఎలా మారుస్తారు..? :  నాగం వర్షిత్ రెడ్డి
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : దశాబ్దాలుగా ఉన్న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తన క్యాంపు ఆఫీస్​గా ఎలా మారుస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం నల్గొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు మంత్రులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు వచ్చినప్పుడు సేదతీరే వారని, అలాంటి గెస్ట్ హౌస్ ను క్యాంపు ఆఫీస్​గా మారిస్తే నల్గొండకు వచ్చే అతిథులు ఎక్కడ బస చేస్తారని నిలదీశారు. 

దీని వ్యతిరేకిస్తూ బీజేపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్​చేశారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయకులు మధుసూదన్ రెడ్డి, బండార్ ప్రసాద్, చంద్రశేఖర్, రామరాజు, పి.సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.