ప్రజల్లో జాతీయ భావం పెంచడమే లక్ష్యం : శ్రీదేవిరెడ్డి

ప్రజల్లో జాతీయ భావం పెంచడమే లక్ష్యం : శ్రీదేవిరెడ్డి
  • బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీదేవిరెడ్డి

యాదాద్రి, సూర్యాపేట, నార్కట్​పల్లి, వెలుగు : ప్రజల్లో జాతీయ భావాన్ని పెంచడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి తెలిపారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నార్కట్​పల్లిలో 70 మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పహల్గాం ఉగ్రవాదులును ఏరివేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పాకిస్తాన్​లోని 9 ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసి భారత సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. 

అంతర్గత  ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే పౌరులకు దేశంపై ప్రేమను పెంచడమే మార్గమని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో తిరంగా ర్యాలీ నిర్వహించి పౌరులను చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ క్రాంతి కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు మేడబోయిన శ్రీనివాస్, నాయకులు పాల్వాయి భాస్కరరావు, మునుకుంట్ల గణేశ్, బిల్లకంటి శ్రీకాంత్, నోముల నాగరాజు, ముంత నరసింహ, మల్లెబోయిన రామలింగం, వడ్డేగోని రామలింగం, పాలకూరి రమేశ్, పామనగుండ్ల శివ, నల్లగొండ నాగరాజు, పల్లెర్ల నాగరాజు, మునుగోటి ప్రసాద్, నీలం శివరాం తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీలు..

బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట ఎల్ఐసీ ఆఫీస్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా గాంధీ విగ్రహం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. యాదాద్రి జిల్లా ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హచ్ఎం మంజుల, ఎన్సీసీ అధికారి వెంకటేశ్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ చేపట్టారు.