హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి

హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి  

కోరుట్ల, వెలుగు : ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి, రాష్ర్ట నాయకుడు డాక్టర్ చిట్నేని రఘు, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలోని బీజేపీ ఆఫీస్​లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో  స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

 అనంతరం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశవాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమావేశంలో అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, మెట్ పల్లి పట్టణ అధ్యక్షుడు రమేశ్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఏలేటి నరేందర్ రెడ్డి, నాయకులు దొనికెల నవీన్, బద్దం గంగాధర్ రెడ్డి, తుకారంగౌడ్, మండల అధ్యక్షుడు రాజుపాల్ రెడ్డి  పాల్గొన్నారు.