
అమరావతి: ఏపీ ప్రజల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కొంత మందికి కరోనా నుంచి కోలుకున్నవారికి బ్లాక్ ఫంగస్ సోకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజారోగ్య దృష్ట్యా ఏపీలో బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్యశ్రీ పరిధిలో ట్రీట్ మెంట్ అందిస్తామని సోమవారం మంత్రి ఆళ్లనాని తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించామన్న మంత్రి..10 వేల ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లను టెండర్లకు పిలిచినట్లు తెలిపారు. బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో ట్రీట్ మెంట్ అందిస్తామని తెలిపారు. బ్లాక్ ఫంగస్ నివారణకు మందులు సమకూర్చాలని సీఎం జగన్ సూచించారని తెలిపారు మంత్రి ఆళ్లనాని.