రఫెల్ యుద్ద విమానాల కొనుగోలు అగ్రిమెంట్ పై లోక్‌సభను కుదిపేయగా… దానిపై బీజేపీ మిత్రపక్షమైన శివసేన తన పత్రిక సామ్నాలో బీజేపీ తీరును ఎండగట్టింది. శివసేన లోక్‌సభలో బీజేపీని నిలదీసిన తీరును సామ్నా రాసుకొచ్చింది. రఫేల్ వివాదంలో మద్దతిచ్చిన వారిని దేశభక్తులుగా, ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా ఎందుకు చేస్తున్నారంటూ బీజేపీని ప్రశ్నించింది. లోక్‌సభలో రఫెల్ అంశంపై తాజాగా బయటకొచ్చిన లేఖపై ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదు అంటూ…ఈ విషయంలో అనవసరంగా ప్రతిపక్షాలను ఎందుకు నిందిస్తున్నారు అంటూ ప్రశ్నించింది. చౌకీదారే దొంగ అనే నింద కాంగ్రెస్ కారణంగా రాలేదని…అది మోడీ అవలంబిస్తున్న విధానాలతోనే వచ్చిందంటూ తీవ్రంగా విమర్శలు చేసింది.
