చైనాలోని బీజింగ్‌‌లో మండుతున్న ఎండలు

చైనాలోని బీజింగ్‌‌లో మండుతున్న ఎండలు
  • ప్రజలు బయటకు రావద్దని హెచ్చరిక

బీజింగ్‌‌: చైనాలో కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దాంతో ఉత్తర చైనాలోని కొన్ని ప్రాంతాలతో పాటు బీజింగ్‌‌లోనూ గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. దీనివల్ల వడగాడ్పుల తీవ్రత కూడా పెరిగింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రత పెరిగిపోతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎమర్జెన్సీ ఉంటేనే ప్రజలు బయటకు రావాలని హెచ్చరించారు.

బీజింగ్‌‌లోని నంజియావో అబ్జర్వేటరీలో వరుసగా మూడో రోజు శనివారం కూడా 40 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ నమోదయ్యిందని చైనా మెటీరోలాజికల్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.హెబీ ప్రావిన్స్, టియాంజిన్‌‌లోనూ కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా ఉందని తెలిపింది.