స్టాక్ మార్కెట్ రక్త కన్నీరు : గూగుల్, టెక్ మహీంద్రా దెబ్బతో కుదేలు

స్టాక్ మార్కెట్ రక్త కన్నీరు : గూగుల్, టెక్ మహీంద్రా దెబ్బతో కుదేలు

ఇండియన్ స్టాక్ మార్కెట్ ఢమాల్ అన్నది.. అక్టోబర్ 26వ తేదీ గురువారం రోజు.. ఇన్వెస్టర్లకు రక్త కన్నీరు అయ్యింది. ఓపెనింగ్ నుంచే రెడ్ లో ట్రేడ్ అయ్యాయి స్టాక్స్. అవీ ఇవీ అని తేడా లేకుండా అన్ని కంపెనీల షేర్లు నష్టాలతోనే ప్రారంభం కావటంతో.. పతనం భారీగా ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి.. సెన్సెక్స్ 800 పాయింట్లు, నిఫ్టీ 255 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. 

బ్యాంకింగ్ షేర్లలో యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా.. మిగతా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. టెక్ కంపెనీ షేర్లు అన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఓవరాల్ గా 10 శాతం షేర్లు కూడా లాభాల్లో లేకపోవటం విశేషం. 

స్టాక్ మార్కెట్ పతనానికి మూడు కారణాలు ఉన్నాయి. గూగుల్ తన మాతృసంస్థ ఆల్ఫాబీట్ సంస్థ లాభాలు భారీగా తగ్గినట్లు ప్రకటించింది. దీనికితోడు ఇండియన్ టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటి అయిన టెక్ మహీంద్రా తన లాభాలు 62 శాతం తగ్గినట్లు ప్రకటించింది. గత ఏడాది 12 వందల కోట్ల లాభాలు చూపించగా.. ఈసారి 450 కోట్లు మాత్రమే వచ్చినట్లు ప్రకటించింది. 16 సంవత్సరాల్లో.. టెక్ మహీంద్ర లాభాలు ఈ స్థాయిలో తగ్గిపోవటం ఇదే మొదటి సారి కావటంతో.. నెగెటివ్ సెంటిమెంట్ నెలకొంది మార్కెట్ లో.  

ఈ పరిణామాలతో ఐటీ, టెక్ కంపెనీల షేర్లు అన్నీ భారీగా నష్టపోయాయి. దీనికితోడు అంతర్జాతీయంగా ఉన్న ఆర్థిక మాంద్యం, పశ్చిమ ఆసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణంతో.. ఆయిల్ ధరలు పెరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ స్టాక్ మార్కెట్ ను దెబ్బతీశాయి. 

మరోవైపు ఆదానీ గ్రూప్ కు చెందిన 10 లిస్టింగ్ షేర్లు సైతం నష్టాల్లో ట్రేడ్ కావటం.. మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. షార్ట్ టర్మ్, డైలీ ట్రేడింగ్ చేసే పెట్టుబడిదారులు.. పెద్దఎత్తున షేర్ల అమ్మకానికి దిగటంతో మార్కెట్ ఏ దశలోనే కోలుకోలేకపోయింది. ప్రారంభంలో 250 పాయింట్లు మాత్రమే నష్టపోగా.. ఆ తర్వాత క్రమంగా మధ్యాహ్నం ఒంటి గంటకు 800 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్.. 255 పాయింట్ల నష్టంలో నిఫ్టీ ఉన్నాయి. 

టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, హీరో మోటార్స్, టాటా స్టీల్, ఐషర్ మోటార్స్, హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, విప్రో, సిప్లా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.

ALS0 READ :- ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమింగ్ కంపెనీలకు .. రూ. లక్ష కోట్ల ట్యాక్స్ నోటీసులు