55మంది ప్రయాణిస్తున్న పడవ బోల్తా

55మంది ప్రయాణిస్తున్న పడవ బోల్తా

బిహార్​లోని గంగానదిలో సుమారు 55 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ అకస్మాత్తుగా బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 10 మంది గల్లంతయ్యారని పోలీసులు తెలిపారు.  పట్నా సమీపంలోని దానాపూర్ పట్టణం షాపూర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో మిగిలిన వారంతా సురక్షితంగా బయటపడ్డారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. రాత్రంతా నదిలో ఎంత వెతికినా గల్లంతైన వారి ఆచూకీ లభ్యం కాలేదని వారు తెలిపారు. ఇక రోజూ లాగే సుమారు 55 మంది పశువుల మేత తెచ్చేందుకు, మరికొందరు కూరగాయలు కోసేందుకు గంగాహర ద్వీపానికి బయలు దేరారు. తిరిగి వస్తున్న సమయంలో పడవ మునిగిపోవడం వల్ల ప్రయాణికులు నదిలోకి దూకేశారు. అందులో ఈత వచ్చిన వారు ఒ‌డ్డుకు చేరగా మిగిలిన వారు,  గల్లంతైనట్లు స్థానికులు చెబుతున్నారు. చిన్నబోటులో పరిమితికి మించి ప్రయాణించడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు అంటున్నారు.

గంగానదిలో చోటు చేసుకున్న ఈ సంఘటనతో గ్రామస్తులంతా తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. నదీ తీరానికి చేరి కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదిలా ఉండగా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారని స్పష్టం చేశారు