లీవ్​లో వెళ్లిన బోధన్​ సీఐ

లీవ్​లో వెళ్లిన బోధన్​ సీఐ

 నిజామాబాద్​, వెలుగు :  బోధన్ టౌన్​ సీఐ ప్రేమ్​కుమార్ లీవ్​లో వెళ్లారు. బదిలీ ప్రయత్నాల్లో ఉన్న ఆయన ఈ నెల 19 వరకు సెలవు తీసుకున్నారు. నిజామాబాద్​ డీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​ వీరయ్య ఆయన స్థానంలో బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ వచ్చిన రెండు రోజులకే చోటు చేసుకున్న పరిణామం పోలీస్​ శాఖలో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్​ఎమ్మెల్యేగా వ్యవహరించిన షకీల్ సిఫారసుతో వచ్చిన ప్రేమ్​కుమార్​ను పలు వివాదాలు చుట్టుముట్టాయి. గత సంవత్సరం పట్టణంలో శివాజీ విగ్రహం ఏర్పాటు సందర్భంగా రగులుకున్న లా అండ్​అర్డర్​ సమస్య మున్సిపల్​ చైర్​పర్సన్​ తూము పద్మ భర్త శరత్​రెడ్డిపై కేసుల నమోదుకు దారితీసింది.

గత జూన్ నెలలో ఎమ్మెల్యే షకీల్​పై హత్యాయత్నం చేశారంటూ ముగ్గురు ఎంఐఎం లీడర్లపై కేసు నమోదు చేసి జైలుకు పంపడం  రాజకీయ దుమారం లేపింది. ఎమ్మెల్యేకు అనుకూలంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు సీఐ ప్రేమ్​కుమార్​పై వచ్చాయి.  ఎన్నికల ప్రచార టైంలో ఎడపల్లి మండలంలో లాఠీఛార్జి, కౌంటింగ్​ తరువాత ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఫర్నిచర్​ తరలింపు తదితర విషయాలు  వివాదాస్పదమయ్యాయి.

ఎన్నికల్లో సుదర్శన్​రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడ పనిచేయడం వల్ల ఇబ్బంది సృష్టించే అవకాశాలున్నాయని భావించి లీవ్​లో వెళ్లారు. రూరల్​ఎన్నికల ప్రచార సభకు వచ్చిన  టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్​రెడ్డి బోధన్​ఏసీపీ కిరణ్​కుమార్​కు మైకులో ఓపెన్​ వార్నింగ్​ వచ్చారు. కాంగ్రెస్​ గవర్నమెంట్​ ఏర్పాటవుతున్నందున ఏసీపీ కూడా ట్రాన్స్​ఫర్​ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 

బోధన్ : పట్టణ సీఐగా ఎస్. వీరయ్య పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సీఐగా పనిచేసిన ప్రేమ్​కుమార్​ లాంగ్​లీవ్​లో వెళ్లడంతో నిజామాబాద్​ సీసీఎస్​లో పనిచేస్తున్న సీఐ వీరయ్య బదిలీపై వచ్చారు.