ఇద్దరు మహిళల డెడ్‌ బాడీలు…

ఇద్దరు మహిళల డెడ్‌ బాడీలు…

లంగర్ హౌజ్‌‌లో దారుణం జరిగింది . మంగళవారం మూసీ కాల్వలో ఇద్దరు మహిళల డెడ్‌‌ బాడీలు దొరికాయి. డెడ్‌‌ బాడీల తల, మెడపై గాయాలు ఉండడంతో హత్య చేసి ఇక్కడపడేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారంతో లంగర్‌‌హౌస్‌‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డెడ్‌‌ బాడీలను పరిశీలించి,వాటిని స్వాధీనం చేసుకున్నారు. మహిళల వయస్సు 50- నుంచి 54 ఏళ్లు ఉంటుందని అంచనా వేశారు. డెడ్‌‌బాడీలపై గాయాలు ఉండడంతో ఎక్కడైనా హత్య చేసి ఇక్కడ పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ సేకరించి సీసీ కెమెరాల ఫుటేజ్ ల ఆధారంగా డెడ్‌‌బాడీలు ఎవరివి, వారు ఎక్కడివారు అనే వివరాలు సేకరిస్తున్నారు