కరోనా వల్ల ఈక్వెడార్ పడుతున్న తిప్పలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గాయక్విల్ సిటీలో మృతదేహాలను భద్రపరిచేందుకు మార్చురీల్లో చోటు లేదు. అంత్యక్రియలకు శ్మశాన వాటికల్లో స్థలం లేదు. దీంతో దిక్కుతోచక మృతదేహాలను వీధుల్లోనే ఉంచుతున్నారు . వాటిపై ప్లాస్టిక్ కవర్లు, అట్టపెట్టెలు కప్పుతున్నారు . అవి రోజుల తరబడి వీధుల్లోనే ఉంటున్నాయి. ఆఫీసర్లకు ఫోన్ చేస్తే స్పందించడం లేదని, ఏంచేయాలో తెలీక బయటే శవాలను ఉంచుతున్నామని కుటుంబసభ్యులు వాపోతున్నారు . తమ వాళ్ల శవాలను వీధుల్లో ఉంచడం ఇష్టం లేక, మరికొందరు ఇండ్లలోనే భద్రపరుస్తున్నారు.
