ప్లాస్టిక్ బ్యాగ్‌లో 9 ఏళ్ల బాలుడి మృతదేహం

V6 Velugu Posted on Oct 14, 2021

ఢిల్లీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 9 ఏళ్ల బాలుడిని హత్యచేసి ప్లాస్టిక్ కవర్‎లో మూటగట్టారు. ‎ఉత్తమ్ నగర్‌‎కు చెందిన ఓ బాలుడు సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండాపోయాడు. దాంతో అతని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు ఆధారంగా.. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. బుధవారం మధ్యాహ్నం బాలుడి మృతదేహం అతని ఇంటికి దగ్గరలోని మరో ఇంట్లో లభించింది. బాలుడి మెడ మరియు ఇతర భాగాలలో గాయలున్నాయి. బాలుడిని గొంతు కోసి చంపి.. ఆ తర్వాత మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పడవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. డెడ్ బాడీ దొరికిన ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని.. అయితే హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు చెప్పారు.

Tagged Delhi, murder, missing, boy murder, Uttam Nagar, boy murder in delhi

Latest Videos

Subscribe Now

More News