యానిమల్లో ఆ సీన్స్ నచ్చలేదు.. తమ్ముడి మూవీపై అన్న షాకింగ్ కామెంట్స్

యానిమల్లో ఆ సీన్స్ నచ్చలేదు.. తమ్ముడి మూవీపై అన్న షాకింగ్ కామెంట్స్

యానిమల్(Animal) సినిమాపై బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్(Sunny Deol) ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన తమ్ముడు బాబీ డియోల్(Bobby Deol) విలన్ గా చేసిన ఈ సినిమాను ఇటీవలే చూసిన సన్నీ డియోల్.. తన అభిప్రయాన్ని ఆడియన్స్ తో పంచుకున్నారు. యానిమల్ సినిమాలో తనకు కొన్ని సీన్స్ నచ్చలేదని చెప్పి షాకిచ్చాడు సన్నీ డియోల్. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.

యానిమల్ సినిమా చాలా గొప్పగా ఉంది. సందీప్ చాలా అద్భుతంగా తీశారు. బాబీ డియోల్ అబ్రార్ పాత్రలో జీవించారు. పాత్ర నిడివి తక్కువే అయినా.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు తమ్ముడు బాబీ. అతని నటన పట్ల అన్నగా చాలా సంతోషంగా ఉన్నాను. ఇక నా సొంత సినిమాల్లోలాగే ఈ సినిమాలో కూడా కొన్ని నచ్చని సన్నివేశాలు ఉన్నాయి. ఒక వ్యక్తిగా, ప్రేక్షకుడిగా సినిమాలో నచ్చిన, నచ్చని విషయాల గురించి చెప్పే స్వేచ్ఛ నాకు ఉంది. బాబీ ఇప్పటి వరకు బాబీగా ఉన్నాడు.. ఇకపై లార్డ్ బాబీగా మారిపోయాడు.. అంటూ యానిమల్ సినిమాపై ఆస్కతికరమైన కామెంట్స్ చేశారు సన్నీ డియోల్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇక యానిమల్ సినిమా విషయానికి వస్తే.. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కిడ్ రణ్బీర్ కపూర్ హీరోగా నటించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించాగా సీనియర్ హీరో అనిల్ కపూర్ కీ రోల్ చేశారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎమోషనల్ అండ్ వైలెంట్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. కేవలం రెండు వారాల్లోనే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది యానిమల్ మూవీ. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా  ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.