మార్కెట్లో బాంబు పేలుడు.. 30 మంది మృతి

మార్కెట్లో బాంబు పేలుడు.. 30 మంది మృతి

సోమవారం సాయంత్రం నైజీరియాలో ఘోర బాంబు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 30 మంది వరకు మరణించి ఉండోచ్చని సమాచారం. నైజీరియాలోని బోర్నోలో ఉన్నబ్రిడ్జిపై ఓ మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ఎప్పుడూ ప్రజలతో రద్దీగా ఉంటుంది. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలకు బ్రిడ్జిపై ఈ బాంబు పేలినట్లు తెలుస్తోంది. గాంబోరులోని ఈ బ్రిడ్జి.. ఆఫ్రికా దేశ పట్టణమైన కామెరూన్‌ను కలుపుతుంది. ఈ దాడిలో దాదాపు 35 మందికి పైగా గాయపడ్డారని, వారందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షి అయిన మోదు అలీ సయిద్ తెలిపారు. ఈ ఘటన తమకు చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ‘నేను ఏదో పెద్ద శబ్దం విన్నాను. అదేంటో తెలుసుకునేలోపే ఘోరం జరిగిపోయింది. నా స్నేహితులు మరియు నా చుట్టుపక్కల ఉన్నవాళ్లలో చాలా మంది అప్పటికే చనిపోయారు’ అని అలీ తెలిపారు.

సివిలియన్ జాయింట్ టాస్క్ ఫోర్స్‌ కొద్ది రోజులుగా బోకో హరామ్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ బాంబు దాడి జరిగినట్లు సమాచారం. బోకో హరామ్, ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ సంస్థకు అనుకూలంగా పనిచేస్తుంది. దాడి జరిగిన ప్రాంతంలో బోకో హరామ్ చురుకుగా ఉంది.