ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్..

ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్..

ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. మరికాసేపట్లో పేలిపోతుందంటూ ఆగంతకుడు కాల్ చేయటంతో హై టెన్షన్ నెలకొంది.ఏకంగా డిప్యూటీ సీఎం నివాసం ఉంటున్న భవనానికే బాంబు బెదిరింపు కాల్ రావటంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సిబ్బందితో సహా ప్రజాభవన్ ని కాళీ చేయించి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు పోలీసులు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అగంతకుడిని గుర్తించే పనిలో పడ్డారు. ఇది ఆకతాయి పనేనా లేక, సంఘ విద్రోహ శక్తుల చర్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.