నల్గొండ జిల్లాలో ఘనంగా బోనాల పండుగ

నల్గొండ జిల్లాలో ఘనంగా బోనాల పండుగ

నల్గొండ, తుంగతుర్తి, యాదగిరిగుట్ట, హుజూర్ నగర్, వెలుగు : నల్గొండలోని గిరకబాయిగూడెం, తుంగతుర్తి, హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామాల్లో ఆదివారం ముత్యాలమ్మ  బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా తరలివెళ్లి ముత్యాలమ్మ వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 

యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో బోనాల పండుగను గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి, కొండలమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. పోతురాజు ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకర్షించింది.