భద్రాచలం, వెలుగు : చర్ల మండలంలోని పూసుగుప్ప అడవుల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో ఏర్పాటు చేసిన బూబీ ట్రాప్స్‌ను గురువారం భద్రతా బలగాలు గుర్తించి తొలగించాయి. దీంతో ఆదివాసీలకు, భద్రతా బలగాలకు భారీ ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ మావోయిస్టులు తమ మనుగడ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. చర్ల మండలం పూసుగుప్ప అడవుల్లో మందుపాతరల కారణంగా అడవుల్లోకి వెళ్లాలంటే ఆదీవాసీలు భయపడుతున్నారన్నారు.
దీంతో అనుమానిత ప్రదేశాల్లో భద్రతాబలగాలతో తనిఖీలు చేయించగా బూబీ ట్రాప్స్ బయటపడ్డాయని చెప్పారు. మొత్తం 58 గోతుల్లో 3,350కి పైగా పదునైన ఇనుప చువ్వలను గుర్తించినట్లు చెప్పారు. బూబీ ట్రాప్స్, ఐఈడీల వల్ల ఆదివాసీలకు ఏమైనా జరిగితే మావోయిస్టులే బాధ్యత వహించాలని ఎస్పీ హెచ్చరించారు.