ఈ లైబ్రరీలో మాటలే పుస్తకాలు

ఈ లైబ్రరీలో మాటలే పుస్తకాలు

లైబ్రరీ అంటే.. పెద్ద హాల్‌‌, చుట్టూ పుస్తకాలు. టెక్నాలజీ పెరిగాక ఇప్పుడు ఈ – బుక్స్‌‌ కూడా వచ్చాయి. ఎవరూ మాట్లాడకుండా, నిశ్శబ్దంగా ఉంటుంది లైబ్రరీ హాల్‌‌. అయితే, హ్యూమన్‌‌ లైబ్రరీలు వాటికి భిన్నం. అక్కడ పుస్తకాలు ఉండవు. మనుషులు మాత్రమే ఉంటారు. కానీ, బోలెడు సమాచారం దొరుకుతుంది. అక్కడ నిశ్శబ్దం ఉండదు. ఒకరికొకరు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇదంతా ఏంటి  అనుకుంటున్నారా?  
ఒకరిని ఒకరు అర్థం చేసుకునేందుకు, మనిషి గురించి మరో మనిషి తెలుసుకు నేందుకు వీలుగా 2020లో హ్యూమన్‌‌ లైబ్రరీ ఏర్పాటు చేశారు. డెన్మార్క్‌‌లోని కోపెన్‌‌హెగన్‌‌లో “ది హ్యూమన్‌‌ లైబ్రరీ’ అనే ఇంటర్నేషనల్‌‌ ఆర్గనైజేషన్‌‌ పేరుతో ఈ కాన్పెప్ట్‌‌ స్టార్ట్‌‌ చేశారు. అలా డెన్మార్క్‌‌లో స్టార్ట్‌‌ చేసిన ఈ హ్యూమన్‌‌ లైబ్రరీలు దాదాపు 50 దేశాలకు విస్తరించాయి. ‘డోంట్‌‌ జడ్జ్‌‌ ఏ బుక్‌‌ బై ఇట్స్‌‌ కవర్‌‌‌‌’ అనే దాన్నుంచి ఈ కాన్సెప్ట్‌‌ వచ్చింది. మనకు తెలియని మనిషితో అరగంట మాట్లాడి వాళ్ల గురించి, వాళ్లకు తెలిసిన విషయాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. మన దేశంలో మొదట ఇండోర్‌‌‌‌లో హ్యూమన్‌‌ లైబ్రరీ స్టార్ట్‌‌  చేశారు. ఆ తర్వాత ఢిల్లీ, చెన్నై, ముంబైల్లో  కూడా మొదలుపెట్టారు. ఇక్కడ కేవలం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడమే కాకుండా కొత్త విషయాల గురించి కూడా చర్చించుకుంటారు. ఒకరికి తెలిసిన విషయాలను మరొకరితో షేర్‌‌‌‌ చేసుకుంటారు.