కరోనా నుంచి వ్యాక్సిన్ కాపాడుతుంది

కరోనా నుంచి వ్యాక్సిన్ కాపాడుతుంది
  • అందరూ కరోనా నిబంధనలు పాటించాలి.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి
  • ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ 

హైదరాబాద్: వ్యాక్సిన్ వేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్టులుండవని, దుష్పరిణామాలుంటాయనే  మాటలన్నీ అవాస్తవమని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే.. ఒకవేళ పడినా వ్యాక్సిన్ వేసుకుంటే ప్రాణాపాయం నుండి బయటపడొచ్చని ఆయన చెప్పారు. సోమవారం చార్మినార్ వద్ద యునాని ఆస్పత్రిలో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి హరీష్ రావుతో కలసి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రారంభించారు. 
ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణలో బూస్టర్ డోస్ ని ఇవాళ్టి నుంచి ప్రారంభించామని, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో వ్యాక్సినేషన్ అత్యంత వేగంగా సాగుతోందన్నారు. టీకా కార్యక్రమాన్ని ముందంజలో నిలిపిన వైద్య ఆరోగ్య శాఖకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని, అలాగే వాక్సిన్ వేుసకోవాలని ఆయన కోరారు. టీకా తీసుకుంటే దుష్పరిణామాలు వస్తాయన్నమాటలు ఎవరూ నమ్మవద్దని అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. కోవిడ్ బారిన పడితే వ్యాక్సిన్ మిమ్మల్ని కాపాడుతుందన్నారు. ఇంట్లో వృద్ధులు, దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారు వుంటే అలాంటి వారిని తీస్కొచ్చి టీకా వేయించాలని కోరారు. 
చార్మినార్ యునాని ఆస్పత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని, పాత భవంతిలో ఆస్పత్రిని నిర్వహించడం కష్టంగా ఉందంటూ ఆస్పత్రిలోని సమస్యలను మంత్రి హరీష్ రావు కు వివరించారు. ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి, మౌళిక వసతులు మెరుగుపరచడం, హాస్టల్ సదుపాయాలను పెంచేందుకు నిధులు మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చారని ఆయన వివరించారు. అలాగే లైబ్రరీని పూర్తి స్థాయిలో  డిగిటలైజేషన్ చేయాలని మంత్రిని కోరామని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

టీకా పంపిణీలో ముందంజలో తెలంగాణ

ప్లేట్​ దోసె 2, ఇడ్లీ 3, ఊతప్పం 4 రూపాయలు

వర్క్​ ఫ్రమ్​ హోమ్..​ కేంద్రం కొత్త గైడ్ లైన్స్ ఇవే