పది మందితో అయినా ఉద్యమం చేస్తం

పది మందితో అయినా ఉద్యమం చేస్తం

అమరావతి: కొత్త వేతనాలు అశాస్త్రీయంగా ఉన్నాయని చెప్పినా ఏపీ ప్రభుత్వం జీతాలు బ్యాంకు ఖాతాల్లో వేసిందని పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. చెల్లింపుల హడావుడిలో చనిపోయిన ఉద్యోగులకు కూడా వేతనాలు ఇచ్చారని ఆయన చెప్పారు. రివైజ్డ్‌ పే స్కేల్‌ వేసే తొందరలో మనుషులు చేసే పనిని మిషన్ల ద్వారా చేసి.. తప్పుల మీద తప్పులు చేస్తోందని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు అన్నారు. చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. అందరినీ అరెస్ట్ చేసినా.. కనీసం 10 మందితో అయినా ఉద్యమం నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

మధురలో కృష్ణుడి ఆలయం కట్టండి చూద్దాం

జనాల జోలికోస్తే ఊరుకునేది లేదు

సీఎంకు సవాల్ చేసిన గవర్నర్