కర్ణాటక టు పాలమూరు.. అక్రమ వ్యాపారులకు అడ్డదారులుగా చెక్​పోస్టులు

కర్ణాటక టు పాలమూరు.. అక్రమ వ్యాపారులకు అడ్డదారులుగా చెక్​పోస్టులు

మహబూబ్​నగర్, వెలుగు  : బార్డర్లలోని చెక్​ పోస్టులు అక్రమ దందాలకు అడ్డదారులుగా మారాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాకు పక్కనే కర్ణాటక, ఏపీ​రాష్ట్రాలు ఉండడంతో అక్కడి నుంచి తెలంగాణలోకి నిషేధిత ఉత్పత్తుల అక్రమ రవాణా జరగుతోంది. అలంపూర్​లోని పుల్లూరు, కృష్ణా మండలంలోని టైరోడ్​ వద్ద తెలంగాణ చెక్​ పోస్టులున్నా.. తనిఖీలు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆర్టీవో, ఎక్సైజ్​ శాఖల ఆధ్వర్యంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి వస్తున్న వెహికల్స్​ను, వాటి వే బిల్స్, సరుకును తనిఖీ చేయాల్సి ఉంది. ఈ రెండు డిపార్టమెంట్లలోని మూడు జిల్లాలకు చెందిన ఆఫీసర్లకు పెద్ద మొత్తంలో ముడుపులు వస్తుండడంతో అక్రమార్కులకు రెడ్​ కార్పెట్​ పరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. 

రాయచూర్​ నుంచి అల్ర్పాజోలం..

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో అల్ర్పాజోలంతో తయారు చేసే ట్యాబ్లెట్ల కంపెనీలున్నాయి. కొన్ని కంపెనీలకు అనుమతులు ఉండగా, మిగతావి ఇల్లీగల్​గా నడుస్తున్నాయి. ఇల్లీగల్​గా నడుస్తున్న కంపెనీల నుంచి ఓ మీడియేటర్​ ద్వారా పాలమూరుకు చెందిన కొందరు వ్యాపారులు పెద్ద మొత్తంలో ఆల్ర్పాజోలం దిగుమతి చేసుకుంటున్నారు.  ప్రతి రోజూ ఒక కారు కర్ణాటకలోని రాయచూర్​ ప్రాంతం నుంచి స్టార్ట్​ అయి మక్తల్​ మీదుగా పాలమూరుకు 30 కిలోల అల్ర్పాజోలం తరలిస్తుందని చెబుతున్నారు. ఈ కారు పాలమూరుకు చేరుకున్నాక ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని కొన్ని ఏరియాలకు ఏజెంట్ల ద్వారా సప్లై జరుగుతున్నట్లు తెలుస్తోంది. కారు వస్తున్న మార్గంలో టై రోడ్​ వద్ద ఆర్టీవో, ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్ల ఆధ్వర్యంలో చెక్​ పోస్టు ఉన్నా, ఆ కారును అడ్డుకోవడం లేదు. ఇందుకుగాను అక్రమార్కులు ఈ రెండు డిపార్ట్​మెంట్లలోని కొందరికి పెద్ద మొత్తంలో ముడుపులు ఇస్తున్నారనే చర్చ నడుస్తోంది.

హైదరాబాద్​ నుంచి బెంగళూర్​కు..

స్మగ్లర్లు ముంబై నుంచి హైదరాబాద్​కు సీహెచ్, డైజోఫాం, గంజాను దిగుమతి చేకుంటున్నారు. ఇక్కడి నుంచి వాహనాల్లో బెంగళూరుకు చేర్చుతున్నారు. ఈ క్రమంలో పుల్లూరు చెక్​పోస్ట్​ వద్ద తనిఖీలు చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. దీనికితోడు కొన్ని హెవీ లోడ్​ వెహికల్స్​లో రహస్యంగా తెలంగాణ లిక్కర్​ను ఏపీకి తరలిస్తున్నారు.

అక్రమార్కులకు లీడర్లు అండ..

ఉమ్మడి జిల్లాలోని గద్వాల, మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాలకు చెందిన రూలింగ్​ పార్టీలలోని కొందరు లీడర్లకు బెంగళూరు, రాయచూర్​ ప్రాంతాల్లో వ్యాపారాలున్నాయి. కొందరు లీడర్లు ఇటీవల వారి బినామీలతో ఆ ఏరియాల్లో రియల్​ ఎస్టేట్​ దందాలు కూడా నిర్వహిస్తున్నారు. వీరు అక్రమ వ్యాపారులకు అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వీరి వాహనాలను ఎవరూ టచ్​ చేయవద్దని ఆఫీసర్లకు ఆర్డర్లు పాస్​ చేశారనే ఆరోపణలున్నాయి. వీరికి పెద్ద మొత్తంలో వాటాలు కూడా ముడుతాయనే చర్చ జరుగుతోంది.

హైదరాబాద్​కు ఈజీ వే..


కర్ణాటక నుంచి ప్రతిరోజు పాలమూరు, హైదరాబాద్​కు పెద్ద మొత్తంలో గంజాయి, ఆల్ర్పాజోలం, ఇతర నిషేధిత ఉత్పత్తుల రవాణా జరుగుతోందనే ప్రచారం ఉంది. అయితే, రాయచూర్​ నుంచి హైదరాబాద్​కు చేరుకోవడానికి బీదర్​ నుంచి వెళ్లేందుకు మరో రూట్​​ఉంది. ఈ రూట్​ మీదుగా వెళ్లాలంటే నిఘా ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్రమార్కులు టై రోడ్​ నుంచి పాలమూరు మీదుగా హైదరాబాద్​కు వెళ్లే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దీనికితోడు ఈ ఏరియాల్లోని ఆఫీసర్లను మేనేజ్​ చేయడంతో, వారి సహకారంతో ఈజీగా నిషేధిత ఉత్పత్తులను ఉమ్మడి జిల్లాను దాటించి హైదరాబాద్​కు చేరుకుంటున్నారు.

టై రోడ్​ దాటిన తరువాత హైదరాబాద్​ వరకు ఎక్కడ చెక్​ పోస్టులు లేకపోవడం వీరికి కలిసి వస్తోంది. అలాగే నిత్యం కార్లు, బైక్​లు, ఆటోలు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన బస్సు లు, తెలంగాణకు చెందిన బస్సుల్లో ఏజెంట్ల ద్వారా నిషేధిత ఉత్పత్తులను తరలిస్తున్నా రు. కొన్ని ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సుల్లోనూ నిషే ధిత ఉత్పత్తులు తరలిస్తున్నారనే టాక్​ ఉంది.