
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల అమరులు కావడం తమను ఎంతో బాధించిందని యూకే చెప్పింది. భారత్ లో బ్రిటిష్ రాయబారి అయిన డొమినిక్ అస్ఖిత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
భారత్, యూకే.. రెండూ ఉగ్ర బాధిత దేశాలని అన్నారు. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా గర్హనీయమని అన్నారు. దీన్ని ఎవరైనా ఖండించి తీరాల్సిందేనని అన్నారు. గత వారంలో పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు తమ సంతాపం తెలియజేస్తున్నామన్నారు.