సింధూ జలాలను వదలకపోతే యుద్ధం తప్పదు: పాక్‌‌ నేత బిలావల్‌‌ భుట్టో హెచ్చరిక

సింధూ జలాలను వదలకపోతే యుద్ధం తప్పదు: పాక్‌‌ నేత బిలావల్‌‌ భుట్టో హెచ్చరిక
  • భారత్‌‌ను ఓడించేందుకు ఐక్యంగా ఉండాలని పాక్‌‌ ప్రజలకు పిలుపు
  • రిలయన్స్‌‌ ఆయిల్‌‌ రిఫైనరీని పేల్చేస్తం: పాక్‌‌ ఆర్మీ చీఫ్‌‌ మునీర్‌‌‌‌
  • పాక్‌‌‌‌ నేత బిలావల్‌‌‌‌ భుట్టో హెచ్చరిక
  • రిలయన్స్‌‌‌‌ రిఫైనరీని పేల్చేస్తం: అసిమ్ మునీర్‌‌‌‌‌‌‌‌

ఇస్లామాబాద్: సింధూ జలాలను వదలకపోతే భారత్‌‌‌‌తో యుద్ధం తప్పదని పాక్  మాజీ విదేశాంగ మంత్రి బిలావల్‌‌‌‌ భుట్టో హెచ్చరించారు. పహల్గాంలో టెర్రరిస్టుల దాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పాకిస్తాన్‌‌‌‌కు భారీ నష్టాన్ని కలిగించాయన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే యుద్ధం గురించి ఆలోచించడం తప్ప మరో మార్గం ఉండదని అన్నారు. కాగా,  శనివారం పాక్‌‌‌‌ ఆర్మీ చీఫ్‌‌‌‌ ఆసిమ్‌‌‌‌ మునీర్‌‌‌‌‌‌‌‌ అమెరికాలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వివాదాస్పద కామెంట్లు చేశారు.

ఇండియాతో వివాదం తలెత్తితే జామ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని రిలయన్స్ ఆయిల్‌‌‌‌ రిఫైనరీని పేల్చేస్తామని హెచ్చరించారు. సింధూ నదిపై భారత్‌‌‌‌ డ్యాం కట్టిన వెంటనే ఒకేసారి 10 మిసైళ్లతో దాడి చేసి పేల్చివేస్తామని అన్నారు. అయితే, మునీర్‌‌‌‌‌‌‌‌ కామెంట్లను భారత ప్రభుత్వం ఖండించింది. పాక్‌‌‌‌ బ్లాక్‌‌‌‌మెయిల్‌‌‌‌కు లొంగిపోయే ప్రసక్తే లేదని దేశ విదేశాంగ శాఖ కౌంటర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. కాగా, మునీర్‌‌‌‌‌‌‌‌ పై పెంటగాన్ మాజీ  అధికారి మైఖేల్‌‌‌‌ రూబిన్‌‌‌‌ మండిపడ్డారు. పాక్ దోపిడీ, మోసకారి దేశమని, అసిమ్‌‌‌‌ మునీర్‌‌‌‌‌‌‌‌.. ఆర్మీ సూట్‌‌‌‌ వేసుకున్న  బిన్‌‌‌‌ లాడెన్‌‌‌‌ అని అన్నారు.