రాజు తలచుకుంటే: అయోధ్యలోని ఆర్మీ భూములు అదానీ, రాందేవ్ సొంతం

రాజు తలచుకుంటే: అయోధ్యలోని ఆర్మీ భూములు అదానీ, రాందేవ్ సొంతం

అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టించడానికి కేవలం రెండు నెలల ముందు  నవంబర్ 2023లో అదానీ గ్రూప్‌కు చెందిన హోమ్‌క్వెస్ట్ ఇన్‌ఫ్రాస్పేస్ సరయూ నది ఒడ్డున ఉన్న జనావాసాలు లేని ప్రాంతమైన మఝా జంతారాలో 1.4 హెక్టార్ల భూమిని కొనుగోలు చేసింది. ఆలయం నుండి కేవలం 6 కి.మీల  దూరంలో ఉన్న ఈ భూమిని అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ బిజెపి మాజీ ఎమ్మెల్యే సిపి శుక్లా స్థాపించిన సంస్థ నుండి కొనుగోలు చేసింది. 

కాగా శుక్లా దానిని గత సంవత్సరం అయోధ్య నివాసి నుండి కొనుగోలు చేశారు.మరోవైపు ఫిబ్రవరి 2022లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో రిజిస్టర్ చేయబడిన పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ అయిన వ్యక్తి వికాస్ కేంద్రం శ్రీశ్రీ రవిశంకర్ స్థాపించిన ఫౌండేషన్  మజా జంతారాలోని అదే ప్రాంతంలో 5.31 హెక్టార్ల భూమిని కొనుగోలు చేసింది. జూలై 2023లో యోగా గురువు రామ్‌దేవ్ భారత్ స్వాభిమాన్ ట్రస్ట్‌తో అనుబంధం ఉన్న హర్యానా యోగ్ ఆయోగ్ ఛైర్మన్ జైదీప్ ఆర్య, అదే ట్రస్ట్‌లో ఉన్న రాకేష్ మిట్టల్‌తో సహా మరో నలుగురు  ఈ ప్రాంతంలో 3.035 హెక్టార్ల భూమిని కొనుగోలు చేశారు.

కాగా ఫీల్డ్ ఫైరింగ్, ప్రాక్టీస్ కోసం రిజర్వు చేయబడిన ఆర్మీ ల్యాండ్‌ను ఆనుకునే మఝా జమ్‌తారా ఏరియా ఉన్నందున దాన్ని రాష్ట్ర ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఏరియాను ఆర్మీ బఫర్ జోన్‌లుగా నోటిఫై చేసింది. దీంతో ఈ ఏరియాలో వాణిజ్య కార్యకలాపాల నిర్మాణాలను నిషేదించారు. కాగా మే 30, 2024న ఈ ఏరియాను బఫర్ జోన్‌ నుంచి మినహాయించి డీనోటిఫై చేసింది. 

దీంతో  ప్రైవేట్ వ్యక్తులు డీనోటిఫై చేసిన భూములలో ఆస్తులను కొనుగోలు చేయవచ్చు.. విక్రయించవచ్చని తెలిపింది. అయితే ఆ ప్రదేశంలో  వ్యవసాయం సాగు చేస్తుందన్నందున జంతుజాలానికి, ఆర్మీ ఆస్తులకు ఎటువంటి హాని జరగకుండా చూడాలని ప్రభుత్వం పేర్కొంది. గవర్నర్ కార్యాలయం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం..  14 గ్రామాలలో మొత్తం  5,419 హెక్టార్ల (13,391 ఎకరాలు)  భూమిని ఆగస్టు 2020 నుండి జూలై 2025 వరకు నోటిఫై చేయగా మజా జంతారా పరిధిలోకి వచ్చే 894.7 హెక్టార్లు (2,211 ఎకరాలు) ప్రత్యేకంగా డి-నోటిఫై చేయబడింది. అయోధ్య జిల్లా అయోధ్య సదర్ తహసీల్‌కి చెందిన మఝా జంతారా గ్రామం ప్లాట్ నంబర్ 1 నుండి 398 వరకు మొత్తం 2,211 ఎకరాల భూమిని డి-నోటిఫై చేసింది ప్రభుత్వం. 

ఈ భూమికి సంబంధించిన కేసు అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో నోటిఫై చేసిన భూమిని పలు సంస్థలు ఆక్రమించాయని అయోధ్యకు చెందిన న్యాయవాది ప్రవీణ్ కుమార్ దూబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. నవంబర్ 24, 2023 నాటి ఆర్డర్‌లో భూమి యొక్క హక్కును సరైన ధృవీకరణ లేకుండా ప్లాన్‌లను మంజూరు చేయడంపై కోర్టు అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ADA)ని ఆదేశించింది. 

రక్షణ మంత్రిత్వ శాఖకు అప్పగించబడిన ప్రభుత్వ భూమిని చట్టాన్ని ఉల్లంఘించి ఆక్రమిస్తే కఠిన చర్యలుంటాయరి పేర్కొంది. అందులో భాగంగా ADA ఈ ప్రాంతంలోని ప్రాజెక్ట్‌ల మ్యాపింగ్‌ను నిలిపివేస్తూ ఆర్డర్‌ జారీ చేసింది. కాగా కేసుల పెండింగ్ లో ఉండగా కూడా  ఆ ప్రాంత అభివృద్ధి కోసమే ఆ భూముల్నీ డి-నోటిఫై చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.విషయం కూడా కోర్టులో ఉన్నందున న్యాయ బృందాన్ని సంప్రదించి ఆపై మఝా జంతారాను డి-నోటిఫై చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.

సైన్యం కూడా ఆ ప్రాంతంలోని  ఫైరింగ్ రేంజ్‌ను ఎప్పుడూ ఉపయోగించదని.. అందుకే  కాబట్టి మఝా జంతారా పరిధిలోని మొత్తం 14 గ్రామాలలోని  భూమిని  ప్రభుత్వం డి-నోటిఫై చేసిందన్నారు. ఈ ఏరియాలో చాలా ఏళ్ల క్రితం వాణిజ్య కార్యకలపాలు జరపకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని.. ప్రస్తుతం పరిస్థితులు మారిన దృష్ట్యా మార్పు తప్పదని.. ఈ డీనోటిఫై అంశంతో ఆ ఏరియా అభివృద్ధి చెందుతుందని అధికారులు తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతంలో  కొత్త ప్రాజెక్టులు కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందని అధికారులు చెప్పారు. మజ్జా జంతారాలో వందల కోట్లతో టెంపుల్ మ్యూజియం నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. అందుకే ఈ నిర్దిష్ట గ్రామాన్ని డి-నోటిఫై చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయానికి అక్కడ భూమిని కొనుగోలు చేసిన ప్రైవేట్ సంస్థలకు ఎటువంటి సంబంధం లేదని అధికారి తెలిపారు.

అంతేకాకుండా సైన్యం మఝా జంతారా చుట్టూ ఎటువంటి కార్యకలాపాలు చేయడం లేదని తెలిపారు. దానికి తోడు ఈ ఏడాది అయోధ్య విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత ఆ ప్రాంతంలో ఆర్మీ ప్రాక్టీస్ దాదాపు  ఆగిపోయిందని తెలిపారు. కాగా సైన్యంలోని కొందరు అధికారులు మాత్రం ఆ ఏరియాలో ఫైరింగ్‌ ప్రాక్టీస్ చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో ఎయిర్ పోర్ట్ ఓపెన్ అయ్యాక విమానాల రాకపోకలు పెరిగాయని.. అందుకే ఈ మధ్య ఫైరింగ్ ప్రాక్టీస్ చాలా వరకు తగ్గించామని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం మొత్తం ప్రాంతాన్ని డి-నోటిఫై చేసిందని తాము భావిస్తున్నట్లు తెలిపారు.


కాగా అక్కడి రైతు అయిన అజయ్ యాదవ్ ను స్థానిక మీడియా ఈ విషయంపై అడగ్గా ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అతను వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగిస్తున్న తన భూమిని గత సంవత్సరం టైమ్ సిటీ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అనే సంస్థకు విక్రయించినట్లు తెలిపారు. ఈ సంస్థ 2017 మరియు 2022 మధ్య కప్తంగంజ్ నుండి బిజెపి ఎమ్మెల్యే శుక్లా స్థాపించిన టైమ్ సిటీ గ్రూప్‌లో భాగంగా ఉందన్నారు. 

అజయ్ యాదవ్ తన భూమిని సంస్థకు విక్రయించిన కొన్ని వారాల తర్వాత అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన హోమ్‌క్వెస్ట్ ఇన్‌ఫ్రాస్పేస్ కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. నేను శుక్లాకు తక్కువ రేటుకే అమ్మానని.. తాను అమ్మిన దానికన్నా రెండింతల రేటుకు శుక్లా అదానీ సంస్థకు ఆ భూమిని అమ్మినట్లు తెలిసిందని ఆ రైతు తెలిపాడు. ఈ భూమి నోటిఫైడ్ ఏరియా కిందకు వస్తుందని తెలియదన్నాడు. ఆర్మీ శిక్షణ కోసం ఆ భూమిని ఖాళీ చేయమని ఇప్పటివరకు ఆదేశించలేదని యాదవ్ చెప్పారు.

కాగా ఈ భూమిని న్యాయబద్ధంగానే కొనుగోలు చేశామని.. భూమి కొనుగోలు క్రమంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని అదానీ సంస్థతో సహా రవిశంకర్, బాబా రాందేవ్ ఫౌండేషన్లు వెల్లడించాయి. పవిత్ర అయోధ్యలో కొన్న భూమిని పవిత్రమైన పనుల కోసమే వాడతామని.. స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా .. అయోధ్య ప్రత్యేకతను చాటేలా ఆయా భూముల్లో పనులు మొదలు పెడతామని పేర్కొన్నాయి. అంతే కానీ బిజినెస్ కార్యకలాపాల కోసం కొనుగోలు చేయలేదన్నాయి.