'కుబేరా' OTTలో విడుదల.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

'కుబేరా' OTTలో విడుదల..  అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

భారీ అంచనాలతో 20 జూన్ 2025న విడుదలైన క్రైమ్ డ్రామా ' కుబేరా ' మూవీ బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్‌ను అందుకుంది.  వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.132 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. తెలుగు సినీ ప్రేక్షకులు అదిరిపోయే శుభవార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. 

ఓటీటీలో విడుదల
'కుబేరా' ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే థియేటర్లలో చూడని వారు, లేదా మళ్ళీ చూడాలనుకునే వారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని చూసి ఆనందించవచ్చు. ధనుష్, నాగార్జున, రష్మిక వంటి అగ్ర నటీనటులు నటించడంతో పాటు, ఆసక్తికరమైన కథాంశం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఓటీటీలో కూడా 'కుబేరా' విజయవంతమవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.  సినీ వర్గాల సమాచారం ప్రకారం 'కుబేరా' మూవీ జూలై 18 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్న ఈ చిత్రం ఓటీటీ వీక్షకులను కూడా అలరించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూలు చేసిన ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ కూడా పెద్దమొత్తంలో ఆఫర్ చేసినట్లు సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది.  

'కుబేరా' కథాంశం
ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన 'కుబేరా' చిత్రం, అండర్‌వరల్డ్‌లో అధికారాన్ని పొందిన ఒక రహస్య వ్యక్తి (ధనుష్) ప్రయాణం చుట్టూ తిరుగుతుంది. అతను అక్రమ మార్గాల ద్వారా సంపదను పోగు చేసుకున్నప్పటికీ, రాబిన్ హుడ్ లాగా పేదలకు సహాయం చేస్తూ, అవినీతిపై పోరాడుతాడు. అయితే, త్వరలోనే అతను ఒక రాజకీయ కుట్రలో చిక్కుకుంటారు. ఈ చిత్రం నీతి, న్యాయం, అధికారం వంటి ఇతివృత్తాలను చర్చిస్తుంది. అంతేకాకుండా, అస్పష్టమైన, గందరగోళ ప్రపంచంలో అవినీతి వల్ల కలిగే నష్టాలను కూడా వివరిస్తుంది.

ALSO READ | Amitabh Bachchan: రణబీర్ రామాయణంలో జటాయువుగా అమితాబ్.!

'కుబేరా'లో ధనుష్‌తో పాటు, టాలీవుడ్ సూపర్ స్టార్ నాగార్జున కీలక పాత్రలో నటించారు. కథానాయికగా రష్మిక మందన నటించారు. 'పుష్ప 2'తో 'నేషనల్ క్రష్' గా గుర్తింపు పొందిన రష్మిక, 'గీత గోవిందం', సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' చిత్రాలతో తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో జిమ్ సర్భ్, దలీప్ తాహిల్, నాజర్ వంటి నటులు కూడా ముఖ్య పాత్రలు పోషించారు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా,  నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా పనిచేశారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో కూడా కొత్త రికార్డులను సృష్టిస్తుందో లేదో వేచి చూడాలి..