
ఈ మూవీలో హీరో , హీరోయిన్ లేదు. కానీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తోంది. వరుసగా వారం రోజుల నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 2 గంటల 10 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు థీయేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు రూ. 44. 25 కోట్లు రాబట్టింది. ఇంకా బాక్సాపీస్ వద్ద వసూళ్ల పర్వం కొనసాగుతోంది. పెద్ద సినిమాలు కలెక్షన్స్ లో డీలా పడ్డా.. ఈ మూవీ వసూళ్లు మాత్రం అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. ఇంతకీ ఈ మూవీ ఏంటనుకుంటున్నారా.. అదే యానిమేటేట్ పౌరాణిక చిత్రం 'మహావతార్ నరసింహ'
బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ..
తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ 'మహావతార్ నరసింహ' సినిమాను మిగతా మూవీస్ మాదిరిగా పెద్దగా ప్రమోట్ చేయలేదు. తొలి రోజుల్లో పెద్దగా బజ్ కూడా లేదు. కానీ సినిమా విడులైన నాటి నుంచి బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. అద్బుతమైన గ్రాఫిక్స్, ఆకట్టుుకునే ప్రెజెంటేషన్ ఈ సినిమాను ఈస్థాయికి తీసుకువచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలను పొందుతుంది. ఈ మహావతార్ మూవీని జూలై 25న థియేటర్లతో విడుదలైంది. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
నాలుగో బిగ్గెస్ట్ హిట్ మూవీగా..
ఈ 'మహావతార్ నరసింహ' సినిమా ను సుమారు రూ. 15 కోట్లు బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది. వసూళ్లు రాబట్టింది మాత్రం దాదాపు రూ. 45 కోట్లకు పైగానే అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హిందీ వెర్షన్ లోనే అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టింది. 2025లో 'చావా', 'జురాసిక్ వరల్డ్ రీ బర్త్', 'సితారే జమీన్ పర్' , 'సయారా' వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం వెండితెరపై రిలీజైన వెంటనే సునామీ సృష్టించింది. 2025లో వచ్చిన మూడు చిత్రాల తర్వాత నాలుగో బిగ్గెస్ట్ హిట్ మూవీగా 'మహావతార్ నరసింహ' నిలిచింది.
Before Comics, Before Cinema…
— Hombale Films (@hombalefilms) July 31, 2025
The universe had already witnessed a divine force from our sacred history.#MahavatarNarsimha - the eternal protector, the OG Superhero 🦁🔥
Witness the divine darshan in theatres near you ✨#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG… pic.twitter.com/weehURsIBg
విమర్శకుల ప్రశంసలు..
ఈ యానిమేటేట్ 'మహావతార్ నరసింహ' చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ ల సారథ్యంలో హోంబాలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిర్మించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లడానికి అద్భుతమైన విజువల్స్, గొప్ప సంస్కృతి, ఉన్నతమైన నాణ్యత, లోతైన కథనం కారణమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. విమర్శకుల ప్రశంసలు అందుకుని, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ మూవీ ఇంకాఎలాంటి రిర్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.
►ALSO READ | Mayasabha : 'మాయసభ'లో ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు పాత్రలు? ఆసక్తి రేపుతున్న కొత్త వెబ్ సిరీస్!