Prabhas: మరోసారి వాయిదా పడిన 'రాజా సాబ్' రిలీజ్? సంక్రాంతి బరిలో ప్రభాస్!

Prabhas: మరోసారి వాయిదా పడిన 'రాజా సాబ్' రిలీజ్?  సంక్రాంతి బరిలో ప్రభాస్!

మారుతి ( Maruthi ) దర్శకత్వంలో ప్రభాస్ ( Prabhas ) హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'రాజా సాబ్' (  Raja Saab ). ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురు చూస్తున్నారు.  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జాప్యం కారణంగా రిలీజ్ డేట్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈచిత్రాన్ని డిసెంబర్ 5, 2025న రిలీజ్ చేయాలని మొదట నిర్ణయించారు.  కానీ ఇప్పుడు అదికాస్త జనవరి 9, 2026కు మారినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.  దీంతో అభిమానులు ఈ సినిమా కోసం మరికొంత కాలం వెయిట్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది.

సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి బిగ్గెస్ట్ ఫెస్టివల్. కాబట్టి ఈ టైమ్ రాజాసాబ్ కు మరింత కలిసివస్తోందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.  వాస్తవానికి ఈ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ లోనే థియేటర్లలోకి రావాల్సి ఉంది.  కానీ తర్వాత జూన్3, డిసెంబర్ 5న కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు అదికూడా వాయిదా పడేలా ఉందని సమాచారం.  దీంతో సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. అయితే డేట్ మార్పుపై మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

"ది రాజాసాబ్" కథ ఒక యువకుడిపై ఆధారపడి ఉంటుంది, అతను ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు తన పూర్వీకుల స్వంత ఆస్తిపై దృష్టి పెడతాడు. ఈ కథలో వినోధం, భయం, రొమాన్స్ ప్రేక్షకులను కొత్త అనుభవాన్ని అందించనుందని మేకర్స్ తెలిపారు.  ప్రభాస్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు.  

►ALSO READ | KINGDOM Collection: ‘కింగ్‌డమ్‌’ తొలిరోజు వసూళ్లు ప్రకటించిన మేకర్స్.. గ్రాస్ ఎన్ని కోట్లంటే?

ఇటీవల సంజయ్ దత్ పుట్టిన ( Sanjay Dutt) రోజును పురష్కరించుకుని ఆయన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. వెంటనే అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  హర్రర్ , కామెడీతో తెరకెక్కుతున్న 'రాజాసాబ్' పై అభిమానుల్లో అంచనాలు భారీగా నే ఉన్నాయి.  మరో వైపు ఈ మూవీ కోసం మూడు పాటలు, ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ మిగిలి ఉంది.  ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని కొత్తదనాన్ని చూపించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. 

 భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నఈ రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,  ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నిర్మితమవుతోంది.  ప్రభాస్‌తో పాటు మాళవికా మోహనన్ ( Malavika Mohanan), నిధి అగర్వాల్ ( Nidhi Agerwal ), రిద్ధి కుమార్ ( Riddhi Kumar) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే నయనతార ఒక ప్రత్యేక గీతంలో కనిపించనుంది. బ్రహ్మానందం, యోగి బాబు, అనుపమ్ ఖేర్, బోమన్ ఇరానీ వంటి నటులు సహాయక పాత్రల్లో ఉన్నారు.