Mayasabha : 'మయసభ'లో ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు పాత్రలు? ఆసక్తి రేపుతున్న కొత్త వెబ్ సిరీస్!

Mayasabha : 'మయసభ'లో ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు పాత్రలు? ఆసక్తి రేపుతున్న కొత్త వెబ్ సిరీస్!

సోనీ లివ్ (Sony LIV) లో ప్రసారం కానున్న కొత్త వెబ్ సిరీస్ 'మయసభ: రైజ్ ఆఫ్ ది టైటాన్స్' (  Mayasabha, Rise of the Titans ) ట్రైలర్ విడుదలైంది. పొలిటికల్ థ్రిల్లర్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్న ఈ ట్రైలర్, సిరీస్ పై భారీ అంచనాలను పెంచుతోంది. ఈ 'మయసభ' ఒక రాజకీయ డ్రామా సిరీస్. శక్తివంతమైన రాజకీయ కుటుంబాలకు చెందిన ఇద్దరు ఒకప్పుడు స్నేహితులుగా ఉండి, వారి మధ్య ఏర్పడిన విభేదాలు, పరిణామాలు ఈ సిరీస్ ప్రధానంగా చూపించనున్నారు.. ఆగస్టు 7, 2025 నుండి సోనీ లివ్లో 'మాయాసభ' స్ట్రీమింగ్ కానుంది.   

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రధానంగా..
ఈ వెబ్ సిరీస్ రాజకీయ కుట్రలు, అధికారం కోసం పోరాటాలను ఆసక్తికరంగా చూపించనుందని అంచనా వేస్తున్నారు. ఇందులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రధానంగా తెరకెక్కించట్లు తెలుస్తోంది.  ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను చూస్తే ఎన్టీఆర్, ఇందిరాగాంధీ,  వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు పాత్రలను  కూడా ఉన్నాయి.  నాటి రాజకీయాలను ప్రభావితం చేసేలా చూపించినట్లు స్పష్టమౌతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  జరిగిన రాజకీయ పరిణామాలే ఇతివృత్తంగా ఈ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి పాత్రలో..
ఈ ట్రైలర్ ఒక రాజకీయ నాయకుడి హత్యతో ప్రారంభమవుతుంది, ఆ మృతదేహాన్ని తరలించడానికి ఒక బస్సు డ్రైవర్ నిరాకరించడం కథలోని సంఘర్షణకు నాంది పలుకుతుంది. ఈ సిరీస్ ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. వారు రాజకీయాల్లోకి రావాలని కలలు కంటారు. వారిలో ఒకరు కృష్ణమ నాయుడు . మరొకరు ఎంఎస్ రామి రెడ్డి.  యూనివర్సిటీలో జరిగే స్టూడెంట్ ఎన్నికల నుంచి అసలు రాజకీయం మొదలవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రతికార రాజకీయాలు.. 
ఈ సిరీస్‌లో రాజకీయాలు, కుల సమీకరణాలు, వాటి మధ్య ఉండే వైరుధ్యాలు ప్రధానాంశాలుగా ఉండనున్నాయి. 'కుక్కలు రొట్టె కోసం కొట్టుకుంటే, మూడోది వచ్చి పట్టుకుపోయింది' వంటి డైలాగులు నాయకుల మధ్య ఉండే వైరుధ్యాలను స్పష్టంగా సూచిస్తున్నాయి. 'డిక్టేటర్‌షిప్ అనేది నాయకత్వం కాదా?' , 'మనం పోరాడి గెలిచిన స్వేచ్ఛ ఇదేనా?' వంటి ప్రశ్నలను లేవనెత్తుతూ, సిరీస్ సమాజంలో నాయకత్వం, స్వేచ్ఛ వంటి అంశాలను చూపించారు.

►ALSO READ | Vijay Devanrakonda మనం కొట్టినం ' #kingdom".. రష్మిక ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ట్రైలర్‌లో హింసతో కూడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తిని కొట్టడం, తుపాకులు పట్టుకుని తిరిగేవాడు సమాజానికి ఓ గుంపే అని పేర్కొనడం వంటి సన్నివేశాలు సిరీస్‌లోని తీవ్రతను తెలియజేస్తున్నాయి. దానికి ప్రతీకారంగా ఎన్‌కౌంటర్లు మొదలుపెట్టాలని ఒక నాయకుడు సవాల్ విసిరే సన్నివేశం మరింత ఉత్కంఠను పెంచుతుంది.

ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ లో ఆగస్టు 7 నుండి తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ప్రసారం కానుంది. ఆది పినిశెట్టి, చైతన్యరావు , సాయికుమార్, దివ్యా దత్తా, నాజర్ కీలకపాత్రలో నటించారు. రవీంద్ర విజయ్, శత్రు, శ్రీకాంత్ అయ్యంగార్, తాన్యా రవిచంద్రన్, రఘుబాబు, భావనా వజపాండల్, చరిత వర్మ తదితరులు నటించారు. దీనికి దేవా కట్టా, కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇతివృత్తంగా ఈ సిరీస్ ఉండనుంది. మరి  ఈ పొలిటికల్ డ్రామా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి..