Vijay Devanrakonda మనం కొట్టినం ' #kingdom".. రష్మిక ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Vijay Devanrakonda  మనం కొట్టినం ' #kingdom".. రష్మిక ఎమోషనల్ పోస్ట్ వైరల్!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda)  ఇప్పుడు ఆనందపు ఆకాశంలో తేలియాడుతున్నాడు.  ఈ రోజు ( జూలై 31, 2025 ) విడుడలైన 'కింగ్‌డమ్' ( Kingdom ) బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ పొందుతోంది. చాలా కాలం తర్వాత విజయ్ తన అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్ని అందించాడు.  థియేటర్లలో 'కింగ్ డమ్' నినాదాలతో మార్మోగుతోంది. 

అందరి ప్రేమతో.. 
బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో  కింగ్ డమ్ దూసుకెళ్తోంది.  ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి విజయ్ దేవర కొండ తన ఎక్స్ ఖాతాలో తన అనందాన్ని పంచుకున్నారు.  ప్రస్తుతం నాకు ఎలా అనిపిస్తుందో మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. మీరందరూ నాతో ఈ అనుభూతిని పొందగలరని కోరుకుంటున్నాను.. ఆహ్ వెంకన్న స్వామి దయ . మీ అందరి ప్రేమ . ఇంకా నేను కావాలి అంటూ పోస్ట్ చేశారు. 

'మనం కొట్టినం' #kingdom" 
'కింగ్‌డమ్' విజయంపై విజయ్ దేవరకొండ  గర్ల్‌ఫ్రెండ్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (  Rashmika Mandanna ) కూడా సంతోషం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా..  "ఇది నీకు, నిన్ను ప్రేమించే వారందరికీ ఎంత ముఖ్యమో నాకు తెలుసు @thedeverakonda!! 'మనం కొట్టినం' #kingdom" అంటూ  పోస్ట్ షేర్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం విజయ్ ఎంతగా కష్టపడ్డాడో తెలుసు అంటూ రష్మిక తన పోస్ట్‌లో గుర్తుచేసింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది, అభిమానులు రష్మిక చేసిన వ్యాఖ్యలను ప్రశంసిస్తున్నారు.

గౌతమ్ తిన్ననూరి భావోద్వేగ సందేశం!
చిత్ర విడుదలకు ముందు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా ప్రేక్షకులకు హృదయపూర్వక సందేశం పంపారు. "ఒక టీమ్‌గా మేము #KINGDOM కోసం మాలోని ప్రతి భాగాన్ని ధారపోశాం. ఇప్పుడు అది మీ అందరిదే" అని ఆయన రాశారు. ఈ సందేశం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. 'కింగ్‌డమ్' దూసుకుపోతోంది. 

 విజయ్ బంపర్ హిట్ కొట్టారా?
గత కొన్నాళ్లుగా వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో విజయ్ దేవరకొండ అభిమానులు కొంత నిరాశలో ఉన్నారు.  కానీ, 'కింగ్‌డమ్'తో విజయ్ మళ్లీ పాత ఫామ్‌లోకి వచ్చాడని సినీ విశ్లేషకులు, ప్రేక్షకులు ముక్తకంఠంతో చెబుతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను అందుకుంది. ఈ చిత్రం 1990ల నాటి శ్రీలంక రాజకీయ నేపథ్యంలో సాగే హై-స్టేక్స్ పొలిటికల్ థ్రిల్లర్.

►ALSO READ | హీరో విజయ్ దేవరకొండ పిటిషన్పై హైకోర్టులో ముగిసిన వాదనలు.. తీర్పు వాయిదా

 ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ అండర్‌కవర్ పోలీస్ ఆఫీసర్‌గా, వ్యక్తిగత ప్రతీకారంతో రగిలిపోయే పాత్రలో కనిపించాడు. అతని గ్రిట్టీ, సీరియస్ పర్ఫార్మెన్స్ గత కొన్నేళ్లలో అతని అత్యుత్తమ నటనలో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలతో కూడిన కథాంశం, అద్భుతమైన నేపథ్య సంగీతం 'కింగ్‌డమ్'ను ప్రేక్షకులు కోరుకున్న థియేటర్ అనుభవంగా మార్చాయి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో 'కింగ్‌డమ్' ఒక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయం అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం అతని స్టార్‌డమ్‌ను మరింత పెంచేదిలా ఉందని ప్రశంసిస్తున్నారు.