
గిరిజనలను కించ పరిచేలా, ప్రతిష్ట దెబ్బ తీసేలా వ్యాఖ్యలు చేశారనే కేసులో విజయ్ దేవర కొండ పిటిషన్ పై తీర్పు వాయిదా వేసింది హైకోర్టు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని విజయ్ దేవరకొండ హైకోర్టు లో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో గురువారం (జులై 31) వాదనలు పూర్తయ్యాయి.
విజయ్ దేవరకొండ సామాజిక మాధ్యమాల్లో క్షమాపణ చెప్పారని ఆయన తరపున న్యాయవాది వాదనల సందర్భంగా హైకోర్టు తెలిపారు. అయితే సోషియల్ మీడియా లో చెప్పిన క్షమాపణలు పరిగణలోకి తీసుకోకూడదని ప్రతి వాదుల తరుపు న్యాయవాదలు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు ముగియడంతో తీర్పు వాయిదా వేసింది న్యాయస్థానం.
హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్ లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గిరిజన సంఘాల ఫిర్యాదుతో విజయ్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
►ALSO READ | Kingdom: థియేటర్లలో దద్దరిల్లుతున్న 'కింగ్ డమ్'.. రామ్ చరణ్, మంచు విష్ణు విషెస్..
రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్లో చేసిన కామెంట్స్ తమను కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు ఫిర్యాదు చేశాయి. ‘‘పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే, ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయి" అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
2025, ఏప్రిల్ నెలలో హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా విజయ్ చేసిన వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు కేసు వేశాయి.