
న్యూఢిల్లీ: ఇండియా యంగ్ బాక్సర్, హైదరాబాదీ నిఖత్ జరీన్ ప్రతిష్టాత్మక స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో పోటీ పడే ఇండియా విమెన్స్ టీమ్‌కు ఎంపికైంది. ఈ నెల 18వ తేదీ నుంచి బల్గేరియాలోని సోఫియాలో జరిగే ఈ టోర్నీలో నిఖత్ 52 కేజీ కేటగిరీలో పోటీ పడనుంది. ఈ టోర్నీ కోసం సెలెక్ట్ అయిన మెన్, విమెన్ బాక్సర్లంతా ప్రస్తుతం ఢిల్లీలో నేషనల్ క్యాంప్‌లో ట్రెయినింగ్ తీసుకుంటున్నారు. ఈ నెల 17వ తేదీన కరోనా టెస్టులు చేసిన తర్వాత సోఫియా బయల్దేరుతారు. .