వరల్డ్ యూత్ బాక్సింగ్‌లో భారత్ హవా

 వరల్డ్ యూత్ బాక్సింగ్‌లో భారత్ హవా
  • సెమీస్‌‌‌‌లో నలుగురు బాక్సర్లు..
  • నాలుగు మెడల్స్‌ ఖాయం

న్యూఢిల్లీ: వరల్డ్‌‌ యూత్‌‌ బాక్సింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా యంగ్‌‌ బాక్సర్లు సత్తా చాటుతున్నారు. ఏషియన్‌‌ చాంపియన్‌‌ వింకా, అల్ఫియా పఠాన్‌‌ సహా నలుగురు బాక్సర్లు సెమీఫైనల్‌‌కు దూసుకెళ్లారు. దాంతో, ఇండియాకు కనీసం నాలుగు బ్రాంజ్‌‌ మెడల్స్‌‌ ఖాయం అయ్యాయి. సోమవారం జరిగిన మహిళల 60 కేజీ  క్వార్టర్‌‌ఫైనల్లో  వింకా 5–0తో  కొలంబియాకు చెందిన కెమిలో కమెలాను చిత్తు చేసింది. 2019 ఏషియన్‌‌ జూనియర్‌‌ చాంపియన్‌‌ అల్ఫియా (+81 కేజీ) కూడా 5–0తో రెకా హాఫ్‌‌మన్‌‌ను మట్టి కరిపించింది. 75 కేజీ కేటగిరీ క్వార్టర్స్‌‌లో పూనమ్‌‌ 5–0తో కజక్‌‌ బాక్సర్‌‌ నజెర్కేను ఓడించింది. 48 కేజీ బౌట్‌‌లో గీతిక.. రుమేనియాకు చెందిన ఎలిసబెత్‌‌ ఒస్టన్‌‌ను చిత్తు చేసింది. అయితే, 81 కేజీ క్వార్టర్స్‌‌లో ఖుషి ఓడిపోయింది. మరోవైపు మెన్స్‌‌ సెక్షన్‌‌లో మనీశ్‌‌ (75 కేజీ), సుమిత్‌‌ (69 కేజీ) క్వార్టర్స్‌‌లో అడుగు పెట్టారు.