సెల్ఫ్ కాన్ఫిడెన్స్ : రూ.4 లక్షలతో గ్రాండ్ గా విడాకుల పార్టీ

సెల్ఫ్ కాన్ఫిడెన్స్ : రూ.4 లక్షలతో గ్రాండ్ గా విడాకుల పార్టీ

ఇటీవల  సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆ లిస్ట్ లో బ్రెజిలియన్ మోడల్ లారిస్సా సంపానీ  కూడా చేరిపోయింది. తన భర్త  నుంచి విడిపోయిన తరువాత చేసుకున్న పార్టీకి 4 లక్షల  రూపాయిలు ఖర్చు పెట్టింది. 

బ్రెజిలియన్ మోడల్ లారిస్సా సంపానీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తన దైనందిన జీవితానికి సంబంధించిన విషయాలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అక్టోబర్ 31న సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి తన భర్తకు విడాకులు ఇచ్చిందని చెప్పింది.  పెళ్లయిన ఆరు నెలలకే విడాకులు విడాకులు తీసుకున్నానని పోస్ట్ చేసింది.  డైవర్స్ అనంతరం లారిస్సా తన స్నేహితులకు పార్టీ ఇచ్చింది.  వివాహం అయిన 6 నెలల తర్వాత ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చానని .. ఇద్దరూ కలిసి 3 సంవత్సరాలు కలసి ఉన్నామని పేర్కొంది.  అయితే ఆరు నెలల క్రితమే వివాహం అయిందని పేర్కొంది.    ఇది ఒక పెద్ద విజయమంటూ..  విడాకులు అనే పదాలతో కూడిన కప్‌కేక్‌ని కూడా తయారు చేసింది. ఇప్పుడు తాను అధికారికంగా ఒంటరిగా ఉన్నానని పేర్కొంది. తాను  కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని తెలిపింది. 

 విడాకులకు కారణం ఏంటంటే... 

లారిస్సా వయస్సు 24 సంవత్సరాలు.. తన భర్త రిలేషన్ షిప్ సమాచారం రహస్యంగా ఉంచాడని పేర్కొంది.  అయితే లారిస్సా విడాకులకు చెప్పిన కారణం చాలా విచిత్రంగా ఉంది. తాను లెస్బియన్ అని.. తాను అమ్మాయిలతో పాటు అబ్బాయిలతో కూడా ఫ్రెండ్ షిప్ చేస్తానని... ఇది  తన భర్తకు ఇష్టం లేదని .. ఆ కారణంగానే విడిపోయామని చెప్పుకొచ్చింది. విడాకుల అనంతర్  రియో డి జెనీరోలోని లారిస్సా స్నేహితురాలి ఇంట్లో ఈ విడాకుల పార్టీ జరిగింది. ఆమె 10 మంది ప్రాణ స్నేహితులను మాత్రమే పార్టీకి ఆహ్వానించారు.

భార్యభర్తల మధ్య ప్రేమ, అనురాగంతోపాటు నమ్మకం కూడా ఉండాలి.  ఈ విషయంలో ఏ మాత్రం అనుమానం వచ్చినా..  వారి మధ్య మనస్పర్దలు ఏర్పడి విడాకులకు దారితీస్తాయి. ఇప్పుడు సరిగ్గా లారిస్సా విషయంలో కూడా అదే జరిగింది. 

ALSO READ :- రాత్రి 8 నుంచి 10 లోపే క్రాకర్స్ పేల్చాలి.. దీపావళి వేళ కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం