వైరల్​ : అద్దాల డ్రెస్సులో అదరగొట్టిన ​ ఫుట్బాల్​ అభిమాని

వైరల్​ : అద్దాల డ్రెస్సులో అదరగొట్టిన ​ ఫుట్బాల్​ అభిమాని

బ్రెజిల్​ ఫుట్​ బాల్​ టీమ్​ అభిమాని ఒకరు అద్దాల డ్రెస్సులో అదరగొట్టాడు. తమ టీమ్​ ను సపోర్ట్​ చేస్తూ ఈ వెరైటీ డ్రెస్సులో మెరిసిపోయాడు. డిజిటల్​ పదజాలంతో చెప్పాలంటే.. నడిచే ఏఆర్​ ఫిల్టర్​ ను అతగాడు తలపించాడు. ఓ వ్యక్తి దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్​ లో షేర్​ చేయడంతో వైరల్​ గా మారింది. శుక్రవార రోజున జరిగిన ఫిఫా ఫుట్​ బాల్​ వరల్డ్​ కప్​ మ్యాచ్​ లో  బ్రెజిల్​ టీమ్​ పై క్రొయేషియా టీమ్​ 4-2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

అయినా ఆ బ్రెజిల్​ అభిమాని నిరుత్సాహపడకుండా అద్దాల డ్రెస్సు ధరించి, చేతిలో అద్దాల ఫిఫా వరల్డ్​ కప్​ నమూనాను పట్టుకొని ఖతర్​ ఎడ్యుకేషన్​ స్టేడియంలో హల్​ చల్​ చేశాడు. అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అక్కడున్న వివిధ దేశాల ఫుట్​ బాల్​ అభిమానులతో కలిసి ఫొటోలు దిగాడు. ఈ వీడియోకు పెద్దసంఖ్యలో వ్యూస్​ వచ్చాయి. ‘ ఇప్పటిదాకా జరిగిన వరల్డ్​ కప్​ వేడుకల్లో ఇలాంటి వెరైటీ  డ్రెస్సు ఇంకెవరూ ధరించలేదేమో’ అని ఒక నెటిజన్​ కామెంట్​ చేశాడు. ‘ఈ అభిమాని కాస్ట్యూమ్​ కు నేను ఫిదా అయ్యాను. అతన్ని చూసి కంప్యూటర్​ సిమ్యులేషన్ ఏమో అనుకున్నాను. అతడిని చాలా అద్భుతమైన ఐడియా’ అని మరో నెటిజన్​ వ్యాఖ్యానించాడు.