నెల్లికల్ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌లో నీటి నిల్వలు కారణంగా మూడు నెలల నుంచి పనులు బంద్‌

నెల్లికల్ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌లో నీటి నిల్వలు కారణంగా  మూడు నెలల నుంచి పనులు బంద్‌
  • మూడు నెలలుగా నిలిచిన పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణం
  • పూర్తి స్థాయిలో నిండిన నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌
  •  నీటి నిల్వలు తగ్గితేనే మళ్లీ పనులు ప్రారంభించే చాన్స్‌‌‌‌‌‌‌‌
  • మరో 9 నెలల్లో పూర్తి చేయడం కష్టమే...

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నెల్లికల్లు రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ పనులకు బ్రేక్‌‌‌‌‌‌‌‌ పడింది. నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ అట్టడుగు భాగం నుంచి పనులు చేపట్టాల్సి రావడం, ప్రస్తుతం రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌లో నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో గత మూడు నెలల నుంచి పనులు బంద్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. 

25 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా... 

నల్గొండ, సూర్యాపేట జిల్లాలో 11 లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌లు నిర్మించనున్నట్లు సాగర్‌‌‌‌‌‌‌‌ ఉప ఎన్నికల టైంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. అన్ని లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లలో నెల్లికల్లే ప్రధానమైంది. లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణంలో భాగంగా కృష్ణా నది నుంచి నెల్లికల్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌రోడ్డు వరకు  కాల్వ ద్వారా నీటిని తీసుకొస్తారు. అక్కడ పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ నిర్మించి మోటార్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడి నుంచి రెండు పైపులైన్ల ద్వారా గ్రామాలకు సాగునీటిని సరఫరా చేస్తారు. తిరుమలగిరి మండలంలో సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.664 కోట్లతో ఈ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ నిర్మాణాన్ని చేపట్టారు. కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ సంస్థ నెల్లికల్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ రోడ్డు సమీపంలోని నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ ఒడ్డున మార్చిలో పంప్ హౌస్ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఆగస్టు మొదటి వారం వరకు పనులు బాగానే నడిచాయి. ఆ తర్వాత భారీ వర్షాలు పడడం, కృష్ణా నదికి వరదలు రావడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇప్పటివరకు పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌, ఎర్త్‌‌‌‌‌‌‌‌ పనులు 10 శాతమే కంప్లీట్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. ప్రస్తుతం సాగర్‌‌‌‌‌‌‌‌లో 587 అడుగుల మేర నీరు ఉంది. అది 565 అడుగులకు చేరితే తప్ప మిగిలిన పనులు చేయడం సాధ్యం కాదని ఆఫీసర్లు అంటున్నారు. జనవరి, ఫిబ్రవరిలో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

18 నెలల్లోనే పూర్తిచేయాల్సి ఉన్నా...

నెల్లికల్‌‌‌‌‌‌‌‌ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి ఫిబ్రవరి 10న సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ శంకుస్థాపన చేశారు. కేవలం 18 నెలల్లోనే పనులు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికి 9 నెలలు పూర్తయినా పనులు మాత్రం 10 శాతమే పూర్తయ్యాయి. పంప్‌‌‌‌‌‌‌‌ హౌజ్‌‌‌‌‌‌‌‌ స్టేజీ వద్దే ఆగిన పనులను మళ్లీ మొదలు పెట్టి మొత్తం స్కీం కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేయాలంటే కనీసం మరో ఏడాదిన్నర టైం పట్టొచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు.

పైప్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి నో పర్మిషన్‌‌‌‌‌‌‌‌

నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌ పంప్‌‌‌‌‌‌‌‌హౌజ్‌‌‌‌‌‌‌‌ నుంచి సుమారు 22 కిలోమీటర్ల మేర ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ భూముల నుంచి పైప్‌‌‌‌‌‌‌‌లైన్లు వేయాల్సి ఉంటుంది. ఫస్ట్‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌లో భాగంగా 10 కిలోమీటర్ల మేర పైప్‌‌‌‌‌‌‌‌లైన్లు వేసేందుకు సెంట్రల్‌‌‌‌‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నుంచి పర్మిషన్‌‌‌‌‌‌‌‌ వచ్చింది. కానీ సెకండ్‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఇంకా పర్మిషన్‌‌‌‌‌‌‌‌ రాలేదు.