- డీఎంహెచ్ఓ పెండెం వెంకటరమణ
హుజూర్ నగర్, వెలుగు: ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌ఓ పెండెం వెంకటరమణ అన్నారు. బుధవారం హుజూర్ నగర్ పరిధిలోని మాధవరాయిని గూడెం లోని బస్తీ దవాఖానను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న టీకాలను వేయించుకొని ఆయా వ్యాధుల నుంచి రక్షణ పొందాలన్నారు.
జిల్లాలో పారామెడికల్ కాలేజీల్లో సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 9 శుక్రవారం సూర్యాపేటలోని పద్మశాలీ భవన్ లో కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.
