మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి : బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి : బీజేపీ అధ్యక్షుడు  నాగం వర్షిత్ రెడ్డి
  •     నల్గొండ బీజేపీ అధ్యక్షుడు  నాగం వర్షిత్ రెడ్డి 

నల్గొండ, వెలుగు: త్వరలో రాబోయే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ  కార్పొరే షన్ సన్నాహక సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన  మాట్లాడుతూ.. నల్గొండ పట్టణం కార్పొరేషన్ గా మారడంతో కేంద్రం నుంచి నిధులు నేరుగా వస్తాయని తెలిపారు. 

నల్గొండ పట్టణం అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు కేంద్ర నిధులు ఉపయోగపడతాయన్నారు.  గతంలో మున్సిపాలిటీ పాలక పక్షాలు నల్గొండ పట్టణ అభివృద్ధిని విస్మరించి కమీషన్ ల కోసం పాకులాడుతూ అభివృద్ధిని మరిచిపోయారని ఆరోపించారు. 

కేంద్రం ఇచ్చే నిధులను దుర్వినియోగం చేసి నల్గొండ పట్టణ ప్రజల ఇబ్బందులకు గురిచేసిన ఈ పాలక పక్షాలకు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బండారు ప్రసాద్, మాధగోని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పల్లె బోయిన శ్యాంసుందర్, నూకల వెంకట్ నారాయణ రెడ్డి, పోతెపాక లింగ స్వామి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, లోకనబోయిన రమణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.