యాదాద్రి, వెలుగు: బస్వాపూర్ రిజర్వాయర్పెండింగ్ ఫండ్స్రూ. 134 కోట్లు రిలీజ్ చేయాలని యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేలు కోరారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి, నకిరేకల్, దేవరకొండ ఎమ్మెల్యేలు మందుల సామెల్, వేముల వీరేశం, బాలూ నాయక్ వినతిపత్రం అందించారు.
ఈ రిజర్వాయర్ ఇప్పటికే 90 శాతం పూర్తయిందని తెలిపారు. నిర్వాసితులకు పరిహారం, ఆర్అండ్ఆర్ పేమెంట్ అందలేదన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఫార్వర్డ్ చేశారు. వెంటనే ఫండ్స్రిలీజ్ చేయాలని సూచిస్తూ ‘ప్రియారిటీ పేమెంట్’ అని పేర్కొన్నారు.
