సంగారెడ్డిలో వాటర్ హెల్త్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఏబీ ఇన్బెవ్‌

సంగారెడ్డిలో వాటర్ హెల్త్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఏబీ ఇన్బెవ్‌

స్వచ్ఛమైన వాటర్ ను అందించడం కోసం  బ్రూవర్‌ అన్హ్యూసర్‌ బుష్‌ ఇన్బెవ్‌ (ఏబీ ఇన్బెవ్‌) తమ మొట్టమొదటి వాటర్‌ హెల్త్‌ కేంద్రం (డబ్ల్యుహెచ్‌సీ)ను సంగారెడ్డిలో జలధార ఫౌండేషన్‌ మరియు వాటర్‌హెల్త్‌ ఇండియా భాగస్వామ్యంతో  ప్రారంభించింది.  శివాజీనగర్‌లోని దాదాపు 20వేల మంది ప్రజలకు   స్వచ్ఛమైన తాగునీరును అందించనుంది.. ఈ కేంద్రాన్ని సంగారెడ్డి మున్సిపల్ ఛైర్మన్‌ శ్రీమతి ఎం విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సంగారెడ్డిలో  సురక్షిత తాగునీటిని అందించాలనే మా ప్రయత్నాలకు తోడ్పాటునందిస్తున్న ఏబీ ఇన్బెవ్‌, జలధార ఫౌండేషన్‌ , వాటర్‌హెల్త్‌ ఇండియాలను అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన మద్దతును తాము అందిస్తామన్నారు.

సంగారెడ్డి వాటర్‌ హెల్త్‌ సెంటర్‌ గంటకు 1000 లీటర్ల స్వచ్ఛమైన నీటిని మార్కెట్‌ ధరలో 70% తక్కువ ధరతో అందిస్తుంది. ఈ సేకరించిన నగదుతో ఈ మెషీన్ల నిర్వహణ కార్యక్రమాలను చేస్తారు. వాటర్‌ హెల్త్‌ ఇండియా 25 సంవత్సరాల పాటు దీని నిర్వహణ కార్యక్రమాలను చూసుకుంటుంది.