కారులో కొత్త జంటను అరెస్ట్ చేసిన పోలీసులు

కారులో కొత్త జంటను అరెస్ట్ చేసిన పోలీసులు
  • నైట్​కర్ఫ్యూ బ్రేక్​ చేశారని..
  • కొత్త జంటను స్టేషన్​కు తీస్కెళ్లిన్రు
  • గుజరాత్​లోని వల్సాద్​లో ఘటన

వల్సాద్(గుజరాత్): పందిట్లో లగ్గం చేసుకొని ఇంట్లో కుడికాలుతో అడుగు పెట్టాల్సిన ఓ కొత్త జంట పెండ్లి బట్టలతోనే అర్ధరాత్రి పోలీస్​ స్టేషన్​కు వెళ్లాల్సి వచ్చింది. నైట్​కర్ఫ్యూ వాళ్లను కేసుల పాలు చేసినట్లయింది. గుజరాత్​లోని వల్సాద్​లో నైట్​కర్ఫ్యూ బ్రేక్​ చేశారని పోలీసులు ఓ పెండ్లి జంటతోపాటు వారి బంధువులను స్టేషన్​కు తీసుకువెళ్లి కేసులు నమోదు చేశారు. గంటల కొద్దీ అక్కడే ఉంచుకొని చివరకు స్టేషన్​ బెయిల్​పై విడుదల చేశారు. వివరాలు.. కరోనా కేసులు పెరుగుతుండటంతో గుజరాత్ ​ప్రభుత్వం ఇటీవల రాత్రి10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పెట్టింది. అంతకు ముందే వల్సాద్‌‌లోని తరియావాడ్ ప్రాంతానికి చెందిన పీయూష్ పటేల్(24) పెండ్లి కుదిరింది. సోమవారం పీయూష్​పటేల్​కు సోనాల్ అనే మహిళతో వివాహం జరిగింది.

వీరిద్దరితోపాటు డ్రైవర్​ ఒక కారులో, బంధువులు ఆరుగురు మరో రెండు కార్లలో వధువు ఊరి నుంచి వల్సాద్​కు బయలుదేరారు. అర్ధరాత్రి 12.20 గంటల ప్రాంతంలో సిటీలోకి ఎంటరయ్యారు. వారి కార్లను  పోలీసులు ఆపారు. నైట్ ​కర్ఫ్యూ బ్రేక్​ చేశారని అందరినీ పోలీస్ ​స్టేషన్​కు తరలించి కేసులు నమోదు చేశారు. చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత వారందరినీ బెయిల్​పై రిలీజ్​ చేశామని డీఎస్పీ మనోజ్​ సింగ్​ చావ్డా చెప్పారు. కాగా పోలీసుల తీరుపై పటేల్​మండిపడ్డారు.‘పోలీసుల తీరుతో నా భార్య చాలా ఇబ్బంది పడి, సిక్ ​అయింది. కర్ఫ్యూ రూల్ అమల్లోకి రావడానికి కొన్ని వారాల ముందే నా పెళ్లి తేది డిసైడ్​అయింది. దూరం కారణంగా రాత్రి 10 లోపు మేము వల్సాద్‌‌కు రాలేకపోయాం. పరిస్థితిని అర్థం చేసుకోవాల్సింది పోయి.. పోలీసులు మమ్మల్ని స్టేషన్‌‌కి తీసుకెళ్లి, దాదాపు రెండు గంటలపాటు అక్కడే ఉంచారు”అని పటేల్​ ఆవేదన వ్యక్తం చేశాడు.