ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి

వనపర్తి, వెలుగు: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కంటి వెలుగు ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​రెడ్డి పిలుపునిచ్చారు.  బుధవారం వనపర్తి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌లో ఎంపీ రాములు,  జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ లోకనాథ్ రెడ్డి,  కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 18 నుంచి 100 రోజుల పాటు కొనసాగనున్న కంటి వెలుగు కోసం జిల్లాలో 28 బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. 18 ఏండ్లు నిండిన వారు 4 ,52,000 మంది ఉన్నారని, వారందరికీ టెస్టులు చేయాలని సూచించారు. కంటి చూపు సమస్య ఉన్నవారికి ఉచితంగా అద్దాలు ఇవ్వడంతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయిస్తామని చెప్పారు.  

కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ గ్రామీణ ప్రాంతాల్లో 300 మంది, పట్టణ ప్రాంతాలలో 400 మందికి కంటి పరీక్షలు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మంత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రం పరిధిలో చేపట్టిన 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్,   రూ.360 లక్షలతో చేపట్టిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన జనరిక్ ఫార్మసీని ప్రారంభించారు.  గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్, ఎస్పీ అపూర్వ రావు,  అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్లు ఆశిష్ సంగ్వాన్, వేణుగోపాల్, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో రవిశంకర్,  ఆర్డీవో పద్మావతి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్  పాల్గొన్నారు.   

పచ్చని పొలాల్లో చిచ్చు రేపుతున్న కంపెనీ

    పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్​

మరికల్, వెలుగు: ఇథనాల్ కంపెనీ పచ్చని పంట పొలాల్లో చిచ్చు రేపుతోందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్​గడ్డం లక్ష్మణ్​మండిపడ్డారు.  బుధవారం మండలంలోని చిత్తనూర్ గ్రామానికి వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  నాలుగు గ్రామాల రైతులు కంపెనీ కారణంగా భూములు కోల్పోయారని, భవిష్యత్‌‌‌‌‌‌‌‌లో పొల్యూషన్‌‌‌‌‌‌‌‌కు బలి కావాల్సి వస్తోందని వాపోయారు. 400 ఎకరాలను మొదట రైస్​మిల్, పండ్ల తోటల కోసమని సేకరించి ఇథనాల్​ కంపెనీ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కంపెనీ వదిలిపెట్టే వ్యర్థ రసాయనాలతో భూములు, చెరువులు, పంటలు, భూగర్భజలాలను కలుషితం అవుతాయని ఆందోళన చెందారు.  

అంతేకాదు రైతుల పైపులు ధ్వంసం చేసి.. పైప్‌‌‌‌‌‌‌‌లైన్ వేయడం ఏంటని ప్రశ్నించారు. పైగా అడ్డుకున్న రైతులను పోలీసులు కొట్టడం, కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్‌‌‌‌‌‌‌‌ అని నిలదీశారు.  గ్రామ సభల తీర్మానాలు, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏర్పాటు చేస్తున్న కంపెనీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  పౌర హక్కుల సంఘం నేతలు నారాయణరావు, మదన కుమారస్వామి, తిరుమలయ్య, సుభాన్​, బాలయ్య, మహదేవ్​, లక్ష్మినారాయణ, ఉమాశంకర్​, వెంకటేశ్, చంద్రశేఖర్​, గ్రామ యువకులు మురళి, మణివర్దన్​  తదితరులు పాల్గొన్నారు.