ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సదాశివపేట, వెలుగు :  స్టూడెంట్స్​ తమ నైపుణ్యాలను పెంచుకునేలా టీచర్లు పాఠాలు చెప్పాలని రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్​ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం పట్టణంలోని బసవ సేవా సదన్ లో ఎంఈవో అంజయ్య ఆధ్వర్యంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్ఎం) మేళాను నిర్వహించారు. కార్యక్రమాన్ని చింతా ప్రభాకర్​ ప్రారంభించి మాట్లాడారు. గవర్నమెంట్​ స్కూళ్లను  రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేస్తోందని, అందులో భాగంగా మనఊరు మనబడి, ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ యాదమ్మ, జడ్పీటీసీ శ్రీదేవి, మున్సిపల్ చైర్ పర్సన్ పిల్లోడి విజయమ్మ,  వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్ విశ్వనాథం, ఎంపీడీవో పూజా, మండల్ నోడల్ అధికారి రుద్రప్ప, హెచ్ఎంలు తుకారం, లింభాజీ, ధనశ్రీ, టీచర్లు సీఆర్పీలు పాల్గొన్నారు. 

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం  

కంది, వెలుగు :  తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని  చింతా ప్రభాకర్ తెలిపారు. బుధవారం కంది మండల కేంద్రంలో శంకర్పల్లి రోడ్డులో రూ.40 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలో రూ.20 లక్షల నిధులకు సంబంధించిన సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం స్థానిక ఓ ఫంక్షన్ హాల్ లో  కంది మండల పరిధిలోని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొండల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణ గౌడ్, గ్రామ సర్పంచ్ విమల, తహసిల్దార్ విజయలక్ష్మి, ఆర్ఐ మల్లికార్జున్ గౌడ్ పాల్గొన్నారు.

టీచర్ల పాత్ర కీలకం.. 

సిద్దిపేట రూరల్, వెలుగు : సమాజ అభివృద్ధిలో టీచర్ల పాత్ర కీలకమని ఎంపీపీ శ్రీదేవి చందర్ రావు అన్నారు. బుధవారం రూరల్ మండల పరిధిలోని చింతమడక గ్రామంలోని  జిల్లా పరిషత్ స్కూల్ లో మండల స్థాయి టీచింగ్ లెర్నింగ్ మేటీరియల్ మేళా ను ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో సమ్మిరెడ్డితో కలసి ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ యాదగిరి, సర్పంచ్ హంశకేతన్ రెడ్డి, ఎంపీటీసీ జ్యోతి దేవేందర్, ఉపసర్పంచ్ రవి, మాచాపూర్ సర్పంచ్ భాగ్యలక్ష్మీబాలయ్య, రాజు ప్రభాకర్ రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ నర్సింహులు, హెచ్ఎం శ్రీనివాస్, నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.

ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి

మెదక్ (మనోహరాబాద్), వెలుగు:  మండలంలోని దండుపల్లి వద్ద నేషనల్​ హైవే మీద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో బుధవారం జీఎంఆర్​ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఇటీవల హైవే విస్తరించగా అక్కడ డివైడర్లు ఏర్పాటు చేయలేదని తెలిపారు. రోజూ దండుపల్లి వైపు నుంచి మనోహరాబాద్ వైపు వందల వెహికల్స్​ వెళ్తుంటాయని,  సూచికలు లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. రాత్రిపూట వాహనదారులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని, అందుకు అక్కడ హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేయాలని కోరారు. 

ల్యాండ్​ పూలింగ్ ​10లోపు పూర్తి చేయాలి

    ఆఫీసర్లకు సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశం 

సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ ఈ నెల 10లోపు పూర్తి చేయాలని సంబంధిత ఆర్డీవోలు, తహసీల్దార్లను సంగారెడ్డి కలెక్టర్​ డాక్టర్ శరత్  ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్​లో అడిషనల్​ కలెక్టర్ వీరారెడ్డి, రాజార్షి షాతో కలిసి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లతో లాండ్ ​పూలింగ్, హై వాల్యూ కాలనీస్, స్ట్రే బిట్స్, జీవో 59 దరఖాస్తులు,  తదితర అంశాలపై సమీక్షించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి సమస్య లేకుండా భూ సమీకరణ ఈనెల 10లోపు పూర్తి చేయాలన్నారు.  జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులపై సమగ్ర నివేదికను అందించాలన్నారు. సమావేశం లో అదనపు  సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు నగేశ్, అంబదాస్, కలెక్టరేట్ ఏఓ మహిపాల్ రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

క్యాలెండర్, డైరీ ఆవిష్కరించిన కలెక్టర్

రెవెన్యూ శాఖ అధికారులు ప్రజలకు మరింత చేరువై మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. బుధవారం సంగారెడ్డి లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా క్యాలెండర్, డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. అడిషనల్ ​కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి కేక్​ కట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరి సమన్వయంతో జిల్లాను అన్ని రంగాలలో ముందుండేలా కృషి చేద్దామన్నారు.  కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు నగేశ్, అంబదాస్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాములు, కార్యదర్శి మహిపాల్ రెడ్డి, అన్ని డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, తహసీల్దారులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్​ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: ఎమ్మెల్యే రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు : బీఆర్ఎస్​ రాష్ట్రంలో చేస్తోన్న అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రఘునందన్​రావు బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో దుబ్బాక పాలక్​ ఇన్​చార్జి అంజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ శక్తి కేంద్రాల ఇన్​చార్జిల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తల బలంతోనే దేశంలో బీజేపీ అధికారంలో కొనసాగుతోందన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీగా బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. కేసీఆర్​ నిరంకుశ రాజకీయాలను, అవినీతిపాలనా వైఫల్యాలను గ్రామ స్థాయిలో ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించారు. 

బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

మెదక్​టౌన్​/నర్సాపూర్, వెలుగు : రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పాలక్ కూన శ్రీశైలం గౌడ్, మెదక్​జిల్లా ప్రెసిడెంట్​శ్రీనివాస్​, హైకోర్టు న్యాయవాది, సీనియర్​ నాయకులు తాళ్ళపల్లి రాజశేఖర్ అన్నారు. బుధవారం నర్సాపూర్,  మెదక్​ పట్టణాలో నిర్వహించిన శక్తి కేంద్రాల ఇన్​చార్జిల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపూర్​లో కూన శ్రీశైలం గౌడ్, మెదక్​లో శ్రీనివాస్, రాజశేఖర్​ మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను, చేస్తున్న అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించి పార్టీ బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 7న బూత్ లెవెల్ స్థాయి మీటింగ్ నర్సాపూర్ లో ఉంటుందని, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి సక్సెస్​ చేయాలని పిలుపునిచ్చారు.  

కోహెడ, వెలుగు: మండలంలోని 27 గ్రామాల్లోని 50 పోలీంగ్​ బూత్​ కమిటీలను బలోపేతం చేయడానికి 19 శక్తి కేంద్రాలుగా విభజించి ఇన్​చార్జిలను నియమించారు. బీజేపీ మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరేసేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు...

ప్రజల కోసం పోరాడిన మల్లేశం

చేర్యాలలో జడ్పీటీసీ శెట్టె మల్లేశం సంతపసభ 

చేర్యాల, వెలుగు : ప్రజల ఆధరాభిమానాలు పొందిన నాయకులకు మరణం లేదని సిద్దిపేట జడ్పీ చైర్​పర్సన్​ వేలేటి రోజారాణి రాధాకృష్ణ శర్మ, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి  అన్నారు. ఇటీవల దారుణహత్యకు గురయిన చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం సంతాప సభ బుధవారం మండల కేంద్రంలోని కల్యాణి గార్డెన్​లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శెట్టె మల్లేశం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిత్యం తపనపడేవారని గుర్తు చేశారు. మంచి నాయకత్వ లక్షణాలతో ముందుకుపోతూ మండల సమస్యలపై పోరాడిన గొప్ప నాయకుడిని హత్య చేయడం పిరికిపంద చర్య అన్నారు. 

నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. జడ్పీ చైర్​ పర్సన్​ రోజారాణి రూ.2లక్షల 10వేలు, జనగామ నియోజకవర్గ కన్వీనర్​ గుజ్జ సంపత్​రెడ్డి రూ.లక్ష విరాళం ఇచ్చారు.  మొత్తంగా రూ.9 లక్షలు మల్లేశం  పిల్లల పేర ఫిక్స్​డ్​ డిపాజిట్​చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్​రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, కన్వీనర్​గుజ్జ సంపత్​రెడ్డి, మున్సిపల్​చైర్​ పర్సన్​ ఎ.స్వరూపారాణి, వైస్​ చైర్మన్​నిమ్మ రాజీవ్​రెడ్డి, ఎంపీపీలు ఉల్లంపల్లి కర్ణాకర్, తలారి కీర్తన, కొమురవెల్లి జడ్పీటీసీ సిద్ధప్ప, సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్​ ఎల్లారెడ్డి, ఎం.బాలనర్సయ్య, టెంపుల్​చైర్మన్​గీస భిక్షపతి, మార్కెట్​ చైర్మన్​ఎస్.మల్లేశంగౌడ్, మండల పార్టీల అధ్యక్షుడు ఎ.మల్లేశం, తదితరులు పాల్గొన్నారు. 

‘కంటి వెలుగు’కు 544 క్యాంపులు

మెదక్​ టౌన్, వెలుగు :  మెదక్​ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న రెండో విడత కంటి వెలుగు కోసం 544 క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు  మెదక్​ డీఎంహెచ్​వో డాక్టర్​ చందునాయక్​ తెలిపారు. బుధవారం జిల్లా ఆఫీసులో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 మంది కంటి వెలుగు ప్రోగ్రాం డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చామన్నారు. కంటి వెలుగు ప్రోగ్రాం ఈనెల18 నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో కంటి వెలుగు ప్రోగ్రామ్​ ఆఫీసర్​ డాక్టర్ నవీన్​ మల్కాజి, జిల్లా నోడల్​ పర్సన్​ రాజయ్య, జిల్లాలోని కంటి వెలుగు డీఈవోలు, ప్రోగ్రామ్​ ఆఫీసర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.