
మంత్రి హరీశ్‌రావు
జహీరాబాద్, వెలుగు: గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మొగుడంపల్లి మండలం ఉప్పరపల్లి తండా సమీపంలో ఉన్న మోతీ మాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు 6 నుంచి 10 శాతం రిజర్వేషన్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన మోతీమాత ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. మెయిన్‌రోడ్డు నుంచి ఆలయం వరకు డబుల్ రోడ్డు మంజూరు చేశారు. అంతకుముందు మంత్రిని గిరిజన మహిళలు, నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు.
18 నుంచి కంటి వెలుగు
సంగారెడ్డి టౌన్ , వెలుగు: సంగారెడ్డి జిల్లాలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి ఈనెల 18 నుంచి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించనున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో 19,01,833 మంది ఉంటే 17,11,685 మంది కంటి పరీక్షలకు అర్హత కలిగి ఉన్నారన్నారు.
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ
పటాన్‌చెరు, వెలుగు: రాష్ట్రంలోనే పటాన్‌చెరు నియోజకవర్గంలో అత్యధికంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. శుక్రవారం పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి 830 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పూర్తి పారదర్శకతతో పట్టాలు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టీఎస్‌ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఏడుపాయలలో దుర్గమ్మ పల్లకీ సేవ
పాపన్నపేట, వెలుగు: ప్రసిద్ద పుణ్య క్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవాని సన్నిధి శుక్రవారం రాత్రి దుర్గమ్మ నామస్మరణతో మార్మోగింది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దుర్గమ్మ పల్లకీ సేవ నిర్వహిస్తారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన పల్లకీ ఊరేగింపు వైభవంగా జరిగింది. ముందుగా వనదుర్గ భవానీ ఉత్సవ విగ్రహనికి ఆలయ అర్చకులు అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. అనంతరం పాలక మండలి చైర్మన్ డాలాగౌడ్, ఈవో శ్రీనివాస్ అమ్మవారి విగ్రహనికి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీ సేవను ప్రారంభించారు. ఊరేగింపు మండపం నుంచి రాజగోపురం మీదుగా ఈశ్వరాలయం వరకు వెళ్లి తిరిగి ఆలయానికి చేరుకుంది. ఈ పల్లకీసేవతో ఏడుపాయల పరిసర ప్రాంతాలు మర్మోగాయి. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు మోహన్ రావు, పెంటయ్య, వెంకటేశం, మన్నెమ్మ ,మనోహర్ , శ్రీనివాసరావు, యాద గౌడ్, నాగభూషణం, సాయిలు, సిద్ధిరాములు, బాగా రెడ్డి, చక్రపాణి, ఆలయ పూజారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
జేపీ నడ్డా వర్చువల్ మీటింగ్ కు ఏర్పాట్లు పూర్తి
నారాయణ్ ఖేడ్, వెలుగు: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం నిర్వహించ తలపెట్టిన వర్చువల్ మీటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. నారాయణఖేడ్ షెట్కార్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఆయన ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు వర్చువల్ మీటింగ్ ద్వారా బూత్‌కమిటీల మెంబర్లతో మాట్లాడుతారన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి రవికుమార్ గౌడ్, ఖేడ్ ఇన్‌చార్జి బాలేశ్‌గౌడ్ ప్రభారి, అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, లీడర్లు పాల్గొన్నారు.
మెదక్ (శివ్వంపేట), వెలుగు: నేడు జరిగే బూత్ కమిటీ మీటింగ్‌కు బూత్‌కమిటీల కన్వీనర్లు, మెంబర్లు హాజరుకావాలని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, నర్సాపూర్ నియోజకవర్గ పాలక్ కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. శుక్రవారం శివ్వంపేట మండలం గోమారంలో జరిగిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.
మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలనిడెడ్‌బాడీతో ధర్నా
సిద్దిపేట, వెలుగు: రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు, బంధువులు ఆందోళన చేశారు. శుక్రవారం నంగునూరు మండలం పాలమకుల గ్రామంలో ప్రమాదానికి కారకులైన ఇంటి ముందు డెడ్‌బాడీతో ధర్నా నిర్వహించారు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఏటి హరికృష్ణ రెండు రోజుల కింద బైక్ పై వెళుతుండగా ఎదురుగా మరో బైక్‌తో కవ్వం అనిల్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కృష్ణ స్పాట్‌లోనే చనిపోయాడు. యాక్సిడెంట్ జరిగిన తరువాత మృతుని కుటుంబాన్ని ఆదుకుంటానని అనిల్ గ్రామస్థుల సమక్షంలో హామీ ఇచ్చి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. దీంతో మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అతని కుటుంబీకులు, బంధువులు డెడ్‌బాడీతో ధర్నా నిర్వహించారు. రాజగోపాలపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ అన్యాయాలను ఎండగట్టాలి: బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్
మెదక్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం ఓబీసీలకు చేస్తున్న అన్యాయాలను ఎండగట్టాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం మెదక్ లో ఉమ్మడి జిల్లా ఓబీసీ శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి భాస్కర్ చీఫ్‌గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. ఓబీసీల అభివృద్ధి, సంక్షేమాన్ని కేసీఆర్ప్రభుత్వం విస్మరించిందని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లాల అధ్యక్షులు రమేశ్‌గౌడ్, నరసింహాచారి, శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దివాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ, గణేశ్ , లీడర్లు రాజశేఖర్, ప్రసాద్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
స్కీమ్‌ల ప్రైవేటీకరణపై నిరసన
సంగారెడ్డి టౌన్ , వెలుగు: కేంద్ర ప్రభుత్వం స్కీమ్‌ల ప్రైవేటీకరణ ఆపాలని, బడ్జెట్ పెంచి వాటిని బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలో భాగంగా శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ మాట్లాడుతూ స్కీమ్కార్మికులను పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ, ఆశా, మిడ్డే మీల్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎన్ హెచ్ఎం, ఐకేపీ, సర్వ శిక్ష అభియాన్ తదితర 72 స్కీమ్‌లలో దేశవ్యాప్తంగా కోటి మంది, రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది పనిచేస్తున్నారన్నారు. నిరసనలో జిల్లా, అధ్యక్ష, కార్యదర్శులు బి.మల్లేశం సాయిలు, యాదగిరి నగేశ్, వివిధ రంగాల నాయకులు పాల్గొన్నారు.
సిద్దిపేటలో...
సిద్దిపేట రూరల్, వెలుగు: స్కీమ్‌ల ప్రైవేటీకరణ ఆపాలని అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.పద్మ, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్కీమ్ వర్కర్లను కార్మికులకు గుర్తించాలనే సిద్దిపేట తహసీల్దార్ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కనకయ్య, శశిరేఖ, రమణి, కనకవ్వ, పోశవ్వ, రజిత పాల్గొన్నారు..
బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి
చేర్యాల, వెలుగు: బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చేర్యాలలో ఐదు మండలాల శక్తి కేంద్రాలు, ఇన్చార్జిలు, కార్యకర్తల మీటింగ్‌కు ఆయన చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ బలోపేతమవుతోందని, అందుకోసం ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో కష్టపడి పనిచేయాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనే వర్చువల్మీటింగ్ను సక్సెస్చేయాలని శ్రీకాంత్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో జనగామ జిల్లా అధ్యక్షుడు దశమంతరెడ్డి, నియోజకవర్గ పాలక్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బి.సురేశ్‌గౌడ్, కేవీఎల్ఎన్ రెడ్డి, శశిధర్‌రెడ్డి, రాందాసు, హరిచంద్ర గౌడ్, శివరాజ్ యాదవ్ పాల్గొన్నారు.
బండి సంజయ్‌కు ఘన స్వాగతం
తూప్రాన్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు తూప్రాన్ టోల్గేట్వద్ద బీజేపీ లీడర్లు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఆయనకు టోల్గేట్వద్ద ఆపి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, పార్లమెంట్ ఇన్‌చార్జి రామ్మోహన్ గౌడ్ పాల్గొన్నారు.
రామాయంపేట, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రామాయంపేటలో బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెలుతూ ఆయన ఇక్కడి బైపాస్ రోడ్డులోని ఓ హోటల్ వద్ద కాసేపు ఆగారు. ఆయన రాకను తెలుసుకున్న బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పట్టణ ప్రెసిడెంట్ శంకర్ గౌడ్, నరేంద్ర చారి పాల్గొన్నారు.