
జిన్నారం, వెలుగు : తమకు ఇచ్చిన భూములకు పోజిషన్చూపాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఊట్ల గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. ఉరితాళ్లను గొంతుకు తగిలించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఊట్ల గ్రామంలోని సర్వే నంబర్ 829, 617, 619, 230లో 120 మంది రైతులకు 169 ఎకరాల భూమిని కేటాయిస్తూ పట్టా పుస్తకాలు, సర్టిఫికెట్లు ఇచ్చారన్నారు. అయితే ఇప్పటి వరకు తమకు పొజిషన్ చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏండ్ల నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధితులు మహేశ్, సాయి, వెంకటేశ్, నాగరాజు, భిక్షపతి, కృష్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు.
మహనీయుల ఆశయాలకనుగుణంగా కేసీఆర్ పాలన
జిన్నారం, వెలుగు : మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిన్నారం మండలం మాదారం గ్రామంలో చాకలి ఐలమ్మ, చత్రపతి శివాజీ, దువ్వగుంట గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాల ఏర్పాటు కోసం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మహనీయులు చేసిన సేవలను తెలియజెప్పాలన్న లక్ష్యంతో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నారని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రామ సర్పంచ్ సరితాసురేందర్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వన దుర్గా భవానీ ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహాలను వనదుర్గా ప్రాజెక్ట్ లో నిమజ్జనం చేసేందుకు తీసుకువచ్చారు. దాదాపు వంద విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేశారు. రద్దీ చాలా ఎక్కువగా ఉండటంతో అమ్మవారి దర్శనానికి రెండు గంటలకుపైగా క్యూలైన్లో నిల్చోవాల్సి వచ్చింది.
దుర్గామాతకు ఎమ్మెల్యే దంపతుల పూజలు
దుబ్బాక, వెలుగు : దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. గురువారం రాత్రి క్యాంప్‌ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన దుర్గా మాతకు ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురోహితులు వేద మంత్రాల నడుమ దుర్గామాతను ఊరేగించి స్థానిక పెద్ద చెరువులో ఎమ్మెల్యే స్వయంగా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, బీజేపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అలయ్.. బలయ్ కి రండి
వట్ పల్లి, వెలుగు: నేడు వట్ పల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న అలయ్.. బలయ్కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కోరారు. శుక్రవారం వట్ పల్లి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనమీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లుగా దసరా పండుగను పురస్కరించుకొని ‘అలయ్.. బలయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మంత్రి హరీశ్ రావు, టెక్స్ టైల్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరవుతారని చెప్పారు.
బీజేపీ అసెంబ్లీ ఇన్చార్జిల నియామకం
సంగారెడ్డి, వెలుగు : బీజేపీ రాష్ట్ర శాఖ సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ప్రభారీ (ఇన్చార్జి)లను నియమించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అసెంబ్లీ స్థాయిలో ఇన్చార్జీలను నియమించారు. సంగారెడ్డి నియోజకవర్గానికి ఎం.జయశ్రీ, పటాన్ చెరుకు మాజీ ఎంపీ ఆర్.ఆనంద్ భాస్కర్, జహీరాబాద్ కు అట్లూరి రామకృష్ణ, నారాయణఖేడ్ కు బాణాల లక్ష్మారెడ్డి, అందోల్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఆలే భాస్కర్ రాజ్ లను
నియమించారు.
తెలంగాణలోని పథకాలు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడున్నయ్..
దుబ్బాక, వెలుగు : రైతును రాజు చేయడానికే కేసీఆర్ ప్రభుత్వం రైతుబీమా, రైతు బంధు అందిస్తోందని, ఈ తరహా స్కీంలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారేమో ఆ పార్టీ నాయకులు చూపించాలని మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. శుక్రవారం దుబ్బాకలో ఆత్మ కమిటీ, తొగుట, దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో వర్షాల కోసం ఎదురుచూసేవారమని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలంతో పని లేకుండా రాష్ట్రంలో రెండు పంటలకు సరిపోను ప్రాజెక్టులను నిర్మించుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అబద్ధాలను నిజాలుగా, నిజాలను అబద్ధాలుగా వక్రీకరిస్తూ పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. దేశ సమైక్యతే లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేస్తోందని, దేశంలో అభివృద్ధి, సంక్షేమం, శాంతి సామరస్యాలను నింపడానికి సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారని మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చాలని ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నామని, అతి త్వరలోనే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారనున్నదని చెప్పారు. జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన వెంటనే కార్యకర్తలు బీఆర్ఎస్ను ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీలు కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, గజ్జెల సాయిలు, జడ్పీటీసీలు కడతల రవీందర్ రెడ్డి, సూకురి లక్ష్మీలింగం, మున్సిపాలిటీ చైర్పర్సన్ గన్నె వనితా భూంరెడ్డి, కొత్తగా ఎన్నికైన ఆత్మ కమిటీ చైర్మన్ నమిలె భాస్కర చారి, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇప్ప లక్ష్మి, దోమల కొమురయ్య యాదవ్‌పాల్గొన్నారు.
సర్కార్ దవాఖానాలపై నమ్మకం పెరుగుతోంది
మెదక్ (చేగుంట), వెలుగు: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా సర్కార్ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. చేగుంటలో కొత్తగా నిర్మించిన మండల పరిషత్, తహసీల్దార్ ఆఫీస్ బిల్డింగ్ లను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్లు, నర్సులు ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తే వంద శాతం మంది ప్రభుత్వ ఆసుపత్రులకే వస్తారన్నారు. మెదక్ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, చేగుంట ఎంపీపీ ఎం.శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
కరెంట్ తీగలు పెట్టి.. చంపాడు
మెదక్ (పెద్దశంకరంపేట), వెలుగు : పాపన్నపేట మండలం చీకోడులో ఓ వ్యక్తి పాతకక్షలతో ఒకరి ప్రాణం తీశాడు. వ్యవసాయ పొలంలో కరెంట్‌తీగలు వేసి ఓ వ్యక్తి చనిపోయేలా చేశాడు. ఈ ఘటన పెద్ద శంకరంపేట మండల పరిధిలోని జూకల్ శివారులో జరిగింది. శుక్రవారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెదక్ డీఎస్పీ సైదులు కేసు వివరాలను వెల్లడించారు. చీకోడ్ గ్రామానికి చెందిన మంగలి సాయిలు రోజులాగే గురువారం తన పొలం బోరుమోటర్ ఆన్ చేసేందుకు గట్టుపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో గట్టుపై పడి ఉన్న కరెంట్‌తీగ తగిలి షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడి మృతిపై మృతుడి భార్య స్వరూప అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. అదే గ్రామానికి చెందిన మంగలి శ్రీరామ్‌కు, సాయిలు పొలం గట్టు విషయంలో గతంలో గొడవలు జరిగాయి. పాతకక్షల కారణంగా సాయిలును చంపేయాలని శ్రీరామ్ పథకం పన్నాడు. అందులో భాగంగా సాయిలు రోజూ వెళ్లే దారిలో కనిపించకుండా కరెంట్ తీగలు పెట్టాడు. దాంతో సాయిలు ఆ తీగలకు తగిలి కరెంట్ షాక్‌తో చనిపోయాడు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో అల్లాదుర్గం సీఐ జార్జ్, రేగోడు ఎస్సై సత్యనారాయణ
ఉన్నారు.
తుపాన్ వెహికల్ దొంగ అరెస్ట్
రామాయంపేట, వెలుగు : ఈనెల 3న రామాయంపేట పట్టణంలో పార్కు చేసిన తుపాన్ వెహికల్ ను ఎత్తుకెళ్లిన దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాకు నిందితుడి వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సేవాలాల్ తండాకు చెందిన దుర్గాప్రసాద్ ఓ నేరంపై జైలుకు వెళ్లి గత నెల 30న రిలీజ్ అయ్యాడు. కాగా ఈనెల 3న రాత్రి రామాయంపేట పట్టణానికి చెందిన మహమ్మద్ రజాక్ స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన తన తుపాన్ వెహికల్ ను పార్కు చేశాడు. ఉదయం చూడగా వెహికల్కనబడలేదు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులకు పెద్దశంకరంపేట శివారులోని ఓ దాబా వద్ద తుపాన్ వెహికల్తో దుర్గాప్రసాద్ పట్టుబడ్డాడు. నిందితుడు గతంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో టూ వీలర్, ఫోర్ వీలర్, ఇండ్లలో దొంగతనాలకు పాడగా, అతడిపై 25 పైగా కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు.
జాతీయ పంచాయతీ అవార్డులకు వివరాలు ఇవ్వండి
సంగారెడ్డి టౌన్, వెలుగు : జాతీయ పంచాయతీ అవార్డుల పోటీలకు ఈ నెల 15లోగా జిల్లాలోని అన్ని గ్రామాల వివరాలను ఎంపీడీవోలకు అందజేయాలని సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ విషయమై శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్‌హాల్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది కేటగిరీలలో అవార్డులను ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. అవార్డుల కోసం పూర్తి సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. మండల స్థాయిలో ఎప్పటికప్పుడు ఆయా ఎంపీవోలు, ఎంపీడీవోలు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య, డీఎం అండ్ హెచ్ వో డాక్టర్ గాయత్రీదేవి, శిశు,మహిళా సంక్షేమ అధికారి పద్మావతి, ఆకడబ్ల్యూఎస్, డీఆర్డీవో, డీఈవో తదితర శాఖల అధికారులు తదితరులు
పాల్గొన్నారు.
యాక్సిడెంట్ కేసులో వ్యక్తికి జైలు శిక్ష
సిద్దిపేట రూరల్, వెలుగు: ఓ యాక్సిడెంట్కేసులో నిందితుడికి 6 నెలల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ.. శుక్రవారం సిద్దిపేట కోర్టు ఫస్ట్ మెజిస్ట్రేట్సల్మా ఫాతిమా తీర్పు ఇచ్చారు. సిద్దిపేట పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణం ఇంద్రానగర్ కు చెందిన అభిలాష్2019 లో తన ఫ్రెండ్అరుణ్ ను బైక్ పై ఎక్కించుకొని ఓవర్‌స్పీడ్‌తో వెళ్లగా.. ఏన్సాన్ పల్లి ఎక్స్ రోడ్ వద్ద యాక్సిడెంట్అయ్యింది. అరుణ్తలకు బలమైన గాయమై చికిత్స పొందుతూ చనిపోయాడు. అప్పటి ఎస్సై గోపాల్ రెడ్డి కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపారు. విచారణ చేపట్టిన కోర్టు నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
జాతీయ పంచాయతీ అవార్డులకు వివరాలు ఇవ్వండి
సంగారెడ్డి టౌన్, వెలుగు : జాతీయ పంచాయతీ అవార్డుల పోటీలకు ఈ నెల 15లోగా జిల్లాలోని అన్ని గ్రామాల వివరాలను ఎంపీడీవోలకు అందజేయాలని సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ విషయమై శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్‌హాల్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది కేటగిరీలలో అవార్డులను ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. అవార్డుల కోసం పూర్తి సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు. మండల స్థాయిలో ఎప్పటికప్పుడు ఆయా ఎంపీవోలు, ఎంపీడీవోలు పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య, డీఎం అండ్ హెచ్ వో డాక్టర్ గాయత్రీదేవి, శిశు,మహిళా సంక్షేమ అధికారి పద్మావతి, ఆకడబ్ల్యూఎస్, డీఆర్డీవో, డీఈవో తదితర శాఖల అధికారులు తదితరులు
పాల్గొన్నారు.
మహిళలకు బాసటగా ‘భరోసా సెంటర్’
మెదక్ టౌన్, వెలుగు : మహిళలకు, బాలలకు జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్ బాసటగా నిలుస్తోందని మెదక్ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శుక్రవారం ఆమె ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఆగస్టు 7న భరోసా కేంద్రాన్ని ప్రారంభించామని, ఇప్పటి వరకు 10 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ సెంటర్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని, మహిళల సమస్యలను పరిష్కరించడంతో పాటు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బాధితులకు ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. నిందితులకు కోర్టులో శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ఉరితాళ్లతో రైతుల నిరసన
జిన్నారం, వెలుగు : తమకు ఇచ్చిన భూములకు పోజిషన్చూపాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఊట్ల గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. ఉరితాళ్లను గొంతుకు తగిలించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఊట్ల గ్రామంలోని సర్వే నంబర్ 829, 617, 619, 230లో 120 మంది రైతులకు 169 ఎకరాల భూమిని కేటాయిస్తూ పట్టా పుస్తకాలు, సర్టిఫికెట్లు ఇచ్చారన్నారు. అయితే ఇప్పటి వరకు తమకు పొజిషన్ చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏండ్ల నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధితులు మహేశ్, సాయి, వెంకటేశ్, నాగరాజు, భిక్షపతి, కృష్ణ, పలువురు రైతులు పాల్గొన్నారు.