“బీమా”తో ధీమాగా బతికేద్దామని దత్తత తీసుకొని చంపేశారు!

“బీమా”తో ధీమాగా బతికేద్దామని దత్తత తీసుకొని చంపేశారు!

లగ్జరీ లైఫ్‌ను అనుభవించాలనే ఉద్దేశంతో ఇండియాలో దత్తత తీసుకున్న 11ఏళ్ల బాలుడ్ని చిన్నారి తల్లిదండ్రులు హతమార్చారు.

బ్రిటన్‌కు చెందిన ఆర్తి ధీర్ (55), ఆమె భర్త కావల్ రైజాడ (30)లు దత్తత తీసుకునేందుకు పిల్లలు కావాలంటూ భారత్‌లో పేపర్ ప్రకటన ఇచ్చారు. ఆ పేపర్ ప్రకటనతో భారత్‌లోని మాలియా అనే గ్రామానికి చెందిన గోపాల్ అనే బాలుడి తల్లిదండ్రులు తమ కుమారుణ్ని ఆర్తీ ధీర్ దంపతులకు దత్తత ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా దత్తత తీసుకున్న గోపాల్‌కు బ్రిటన్‌లో మంచిలైఫ్ ఇస్తామని.. నమ్మబలికి ఇన్సురెన్స్ ఒక్కో ప్రీమియం 15,000 పౌండ్లు (సుమారు రూ.1.37లక్షలు) చెల్లించారు.

అప్పుడే మొదలైంది కుట్ర

గోపాల్ పేరుమీద వచ్చే పాలసీ డబ్బుల్ని కాజేసేందుకు ఆర్తీధీర్ ఆమె భర్త కావల్ రైజాడ కుట్ర పన్నారు. గోపాల్‌ను హతమార్చేందుకు ఓ వ్యక్తికీ కాంట్రాక్టు ఇచ్చారని అభియోగం. 2017 ఫిబ్రవరి 8న ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆ బాలున్ని కత్తులతో పొడిచి హత్యచేస్తుంటే ఆ బాలుడి బావ అడ్డువస్తే అతన్ని కూడా పొడిచి పారిపోయారు. ఆ తర్వాత బాలుడు అండ్ అతని బావ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు.

పోలీసులు మోస్ట్ వాంటెడ్ నోటీసులు జారీ చేశారు. ఆర్తి ధీర్, ఆమె భర్త కావల్ రైజాడపై భారత దేశంలో ఆరు అభియోగాలు నమోదుచేసి.. మోస్ట్ వాంటెడ్ నోటీసులు జారీ చేశారు. భారత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు వీళ్ళిద్దరిని 2017 జూన్‌లో బ్రిటన్‌లో అరెస్ట్ చేశారు. కానీ వీళ్ళిద్దరిని మన దేశానికి అప్పగించటానికి వెస్ట్‌ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. ఆ తర్వాత దంపతులిద్దరూ బెయిల్ మీద విడుదలై బయట తిరుగుతున్నారు.

వాళ్ళిద్దరిని భారత్ కు అప్పగించాలని.. ఇంగ్లాండ్ హైకోర్టులో మళ్ళీ అప్పీల్ చేసింది. అయితే ఈ రోజు (శుక్రవారం) అప్పగించేది లేదని తీర్పించింది ఇంగ్లాండ్ హైకోర్టు.