హమ్మయ్య.. గట్టెక్కినం!..తక్కువ మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలిచిన అభ్యర్థులు

హమ్మయ్య.. గట్టెక్కినం!..తక్కువ మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలిచిన అభ్యర్థులు
  •     హోరాహోరీ పోరులో తక్కువ మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలిచిన అభ్యర్థులు
  •     చేవెళ్లలో 268 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య విజయం
  •     యాకత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పురలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 878 ఓట్ల మెజారిటీ

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో కొందరు అభ్యర్థులు తక్కువ మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలిచారు. రౌండ్ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మారుతున్న సమీకరణాలతో టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడ్డ అభ్యర్థులు.. చివరకు గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఈసీఐ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ఏడు స్థానాల్లో గెలుపోటముల మధ్య తేడా 5 వేల లోపు ఓట్లు మాత్రమే. ఇంకొందరు 9 వేల లోపు ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఇందులో ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థులే ఉండటం గమనార్హం.

  •     చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య.. కాంగ్రెస్ క్యాండిడేట్ భీం భారత్ పమేనాపై 268 ఓట్ల తేడాతో (పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాకుండా) గెలిచారు.
  •     యాకత్​పురలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్.. 878 ఓట్ల మెజారిటీతో మజ్లిస్ బచావో తహ్రీక్ క్యాండిడేట్ అజ్మద్ ఉల్లాఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచారు.  
  •     దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసుదన్ రెడ్డికి 88,551 ఓట్లు వచ్చాయి. ఆయన బీఆర్ఎస్ 
  • అభ్యర్థి  ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డిపై 1,392 ఓట్ల మెజారిటీ​తో గెలిచారు. ఆళ్లకు 87,159 ఓట్లు పోలయ్యాయి.
  •     జుక్కల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ క్యాండిడేట్ లక్ష్మీ కాంతరావు 1,152 ఓట్ల మెజారిటీతో గెలిచారు. లక్ష్మీ కాంతరావుకు 64,489 ఓట్లు రాగా, బీఆర్ఎస్​ క్యాండిడేట్ హన్మంత్ షిండేకు 63,337 ఓట్లు పడ్డాయి.
  •     నాంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 2,037 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ గెలుపొందారు.
  •     బోధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సుదర్శన్ రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 3 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 
  •     ఖానాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ క్యాండిడేట్ వెడ్మా బొజ్జు.. 4,702 ఓట్ల మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బీఆర్ఎస్ అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచారు. 
  •     సిర్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్ బాబు.. బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కొనప్పపై 3,088 ఓట్ల తేడాతో గెలిచారు.
  •     సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి.. కాంగ్రెస్ క్యాండిడేట్ రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై 4,606 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
  •     కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్.. బీజేపీ నేత బండి సంజయ్​పై 3,163 ఓట్ల మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలిచారు.
  •     బాల్కొండలో వేముల ప్రశాంత్ రెడ్డి.. 4,533 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్​పై గెలుపొందారు.
  •     కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డికి 75,858 ఓట్లు పోల్ అయ్యాయి. ఆయన 5,410 ఓట్ల తేడాతో తన సమీప బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై గెలిచారు. ఆచారికి 70,448 ఓట్లు పడ్డాయి.
  •     నాగర్ కర్నూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూచుకుళ్ల రాజేశ్ రెడ్డికి 87,161 ఓట్లు వచ్చాయి. ఆయన బీఆర్ఎస్ క్యాండిడేట్​ మర్రి జనార్దన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డిపై 5,248 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జనార్దన్ రెడ్డికి 81,913 ఓట్లు పడ్డాయి.
  •     ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీజేపీ నుంచి పాయల్ శంకర్ 6,692 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్నపై గెలుపొందారు. పాయల్ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 67,608 ఓట్లు.. జోగు రామన్నకు 60,916 ఓట్లు పడ్డాయి.
  •     గద్వాలలో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 7,036 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయనకు 94,097 ఓట్లు రాగా.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సరితకు 87,061 ఓట్లు పడ్డాయి.
  •     స్టేషన్ ఘన్​పూర్ బీఆర్​ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి.. ఇందిర సింగపురంపై 7,779 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
  •     జూబ్లీహిల్స్​లో బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి గోపీనాథ్ 6,850 ఓట్ల తేడాతో గెలిచారు. గోపీనాథ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 48,617 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 41,767 ఓట్లు వచ్చాయి. 
  •     కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిపై బీజేపీ అభ్యర్థి వెంకటరమణా రెడ్డి గెలిచారు. ఆయనకు 66,652 ఓట్లు రాగా.. కేసీఆర్​కు 59,911 ఓట్లు వచ్చాయి. వెంకటరమణా రెడ్డి 6,741 ఓట్ల మెజారిటీ సాధించారు.
  •     నారాయణఖేడ్​లో కాంగ్రెస్ నుంచి పి సంజీవరెడ్డి 6,547 ఓట్ల మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బీఆర్ఎస్ అభ్యర్థి ఎం.భూపాల్​ రెడ్డిపై గెలిచారు.
  •     నారాయణపేటలో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్ణిక రెడ్డి 7,951 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ క్యాండిడేట్ రాజేందర్ రెడ్డిపై గెలుపొందారు. 
  •     నర్సాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి సునితా లక్ష్మారెడ్డి 8,855 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిపై గెలిచారు.
  •     పరకాలలో కాంగ్రెస్ అభ్యర్థి రేవురి ప్రకాశ్ రెడ్డి 7,941 ఓట్ల తేడాతో సమీప అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిపై గెలిచారు.
  •     పటాన్ చెరు నుంచి బీఆర్​ఎస్ క్యాండిడేట్ గూడెం మహిపాల్ రెడ్డి 7,091 ఓట్ల మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్​ గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచారు.  
  •     సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ 8217 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డిపై గెలిచారు.  
  •     షాద్​నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కె.శంకరయ్య.. బీఆర్ఎస్ అభ్యర్థిపై అంజయ్యపై 7,128 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
  •     తాండురులో కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్ రెడ్డి.. పైలెట్ రోహిత్​ రెడ్డిపై 6,583 ఓట్ల మార్జిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గెలిచారు.