జనగామలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అరాచకం

జనగామలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అరాచకం

జనగామ జిల్లాలో ఓ నిరుపేద కుటుంబంపై  అధికార పార్టీ బీఆర్ఎస్  కౌన్సిలర్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. జనగామ పట్టణం సిద్దిపేట రోడ్డులోని కోర్టు సమీపంలో రోడ్డు పక్కన గుడిసే వేసుకొని జీవనం కొనసాగిస్తున్న ఓ నిరుపేద కుటుంబంపై 6వ వార్డు కౌన్సిలర్ నాగరాజు దాడి చేసి.. దౌర్జన్యంగా వారు ఉంటున్న గుడిసెను కూలగొట్టాడు. తాము వేసుకున్న గుడిసెను కూలగొట్టి, తాము ఎంత బతిమలాడినా వినలేదని,  తమపై దుర్భాషలాడుతూ దాడి చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 

తాము గత 30 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, తమకు ఉండడానికి ఎలాంటి గూడు లేక రోడ్డు పక్కనే గుడిసె వేసుకొని జీవనం కొనసాగిస్తున్నామని బాధితులు కన్నీరు పెట్టారు. తమకు ఇక్కడ ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కూడా ఉన్నాయని, ఓట్లు కూడా వేశామని, డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా దరఖాస్తు చేసుకున్న తమకు ప్రభుత్వం ఇల్లు కేటాయించలేదని బాధితులు వాపోయారు.