కారుణ్య నియామకాల్లో గత ప్రభుత్వం అన్యా యం

కారుణ్య నియామకాల్లో గత  ప్రభుత్వం అన్యా యం

ఖైరతాబాద్, వెలుగు:  బీఆర్ఎస్ పాలనలో మంత్రులు జిల్లాల్లోనే కారుణ్య నియామకాలు చేపట్టి తమకు అన్యాయం చేశారని జిల్లా పరిషత్​కారుణ్య నియామక అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో మాత్రమే కారుణ్య నియామకాలు చేపట్టారని పేర్కొన్నారు.  సిద్దిపేట, కామారెడ్డి, జగిత్యాల, మేడ్చల్, మహబూబ్​నగర్, నాగర్​ కర్నూల్ ​జిల్లాల్లోనే జాబ్ ఇచ్చారని.. మిగతా జిల్లాల అభ్యర్థులకు అన్యాయం చేశారని ఆరోపించారు.  

దీర్ఘకాలంగా పెండింగ్​లో ఉన్న జిల్లా పరిషత్ ​జూనియర్​అసిస్టెంట్ ​కారుణ్య నియామకాలను చేపట్టలేదన్నారు. తమ ఫైల్​సీఎస్​ వద్ద ఉందని, వెంటనే పోస్టింగ్​లు ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. జీవో నం.79 ప్రకారం పంచాయితీరాజ్​శాఖలోని అభ్యర్థులకు జూనియర్​ అసిస్టెంట్​పోస్టులు ఇచ్చారని, జిల్లా పరిషత్​శాఖలోని వారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని భవేశ్​ కోరారు.  సమావేశంలో నాగమణి, సాయిప్రసాద్​తదితరులు మాట్లాడారు.