35 సెగ్మెంట్లలో ఫ్లాష్ సర్వే! : గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ!

35 సెగ్మెంట్లలో ఫ్లాష్ సర్వే! : గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ!
  • 35 సెగ్మెంట్లలో ప్లాష్ సర్వే!
  • గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ!
  • ప్రగతి భవన్ నుంచి ఫోన్ వచ్చిందా టికెట్ కట్
  • పిలిపించి సిట్టింగులతో నేరుగా మాట్లాడుతున్న సీఎం
  • భవిష్యత్తులో పదవులు ఇస్తామంటూ భరోసా
  • వలసలకు బ్రేక్.. అసంతృప్తికి తావులేకుండా ప్లాన్  

హైదరాబాద్ : రాష్ట్రంలోని 35 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఫ్లాష్ సర్వే చేయిస్తోంది. అభ్యర్థుల పేర్లు ముందుంచి.. వీళ్లలో ఎవరికి టికెట్ ఇవ్వవచ్చు..? ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తుంది అన్న రీతిలో సర్వే చేయిస్తోంది. ఈ నెల 21న శ్రావణ సోమవారం రోజున బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న ఈ తరుణంలో ఫ్లాష్ సర్వేకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. కొన్ని చోట్ల ముగ్గురు అభ్యర్థుల, మరికొన్ని చోట్ల ఇద్దరేసి అభ్యర్థుల్లో ఎవరైతే గెలుస్తారు..? అనే రీతిన సర్వే సాగుతోంది. 

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి రెండు సెగ్మెంట్లలో పోటీ చేస్తారని సమాచారం. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ కేసీఆర్ బరిలోకి దిగుతారని సమాచారం. అదే జరిగితే కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంప గోవర్ధన్ కు ఎమ్మెల్సీ లేదా ఇంకా ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నియోజకవర్గాల్లో టికెట్ లు ఇవ్వలేని వారిని ప్రగతి భవన్ కు పిలిపించి సీఎం కేసీఆర్ నేరుగా మాట్లాడుతున్నారు. 

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని వివరిస్తూ.. ప్రస్తుతానికి టికెట్ ఇవ్వలేమని భవిష్యత్ లో పదవులు ఇస్తామంటూ భరోసా ఇస్తున్నారు. 22 సెగ్మెంట్ల పేర్లు బయటికి రాగా మరో 13 నియోజకవర్గాల్లోనూ ఫ్లాష్ సర్వేజరుగుతోందని సమాచారం. ఆ నియోజకవర్గాలు ఏవి..? అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. అందులో తమ నియోజకవర్గమేమైనా ఉందా..? అంటూ పలువురు నేతలు ఆరా తీస్తున్నారు. 

నియోజకవర్గాల వారీగా పరిశీలనలో ఉన్న పేర్లు 

1.జహీరాబాద్        ఎమ్మెల్యే మాణిక్ రావు/ఢిల్లీ వసంత్
2. కొత్త గూడెం        వనమా వెంకటేశ్వరరావు/గడల శ్రీనివాసరావు
3. భద్రాచలం        తెల్లం వెంకట్రావు/ లెఫ్ట్ పార్టీలు
4. వైరా            రాములు నాయక్/ మదన్ లాల్
5. కోదాడ            బొల్లం మల్లయ్య యాదవ్/యుగంధర్ రావు
6. నాగార్జున సాగర్         భగత్/ కోటి రెడ్డి/ కంచర్ల శేఖర్ రెడ్డి
7. మునుగోడు         సీపీఐ/కుసుకుంట్ల/గుత్తా అమిత్/కంచర్ల కృష్ణా రెడ్డి
8. కల్వకుర్తి            జైపాల్ యాదవ్/ కసిరెడ్డి
9. తాండూర్         పైలెట్ రోహిత్ రెడ్డి/ మహేందర్ రెడ్డి
10. ఉప్పల్             బేతి సుభాష్ రెడ్డి / బండారు లక్ష్మా రెడ్డి / బొంతు రామ్మోహన్
11. శేరిలింగంపల్లి        అరికెపూడి గాంధీ/ బండి రమేశ్​
12. అంంబర్ పేట        కాలేరు వెంకటేశ్/ ఎడ్ల సుధాకర్ రెడ్డి / దూసరి శ్రీనివాస్ గౌడ్
13. పెద్దపల్లి        దాసరి మనోహర్ రెడ్డి/ నల్ల మనో హర్ రెడ్డి
14. ఖానాపూర్        రేఖా నాయక్/ జాన్సన్
15. సంగారెడ్డి         జగ్గారెడ్డి/చింతా ప్రభాకర్ 
16.పటాన్ చెరు        గూడెం మహిపాల్ రెడ్డి / నీలం మధు
17. నర్సపూర్         మదన్ రెడ్డి / సునీత లక్ష్మారెడ్డి
18. స్టేషన్ ఘన్ పూర్        కడియం/ రాజయ్య
19.వరంగల్ ఈస్ట్        నరేందర్ /గుండు సుధారాణి/వద్ది రాజు
20. జనగాం        ఎమ్మెల్యే ముత్తిరెడ్డి/ పల్లా రాజేశ్వర్ రెడ్డి
21. ములుగు        నాగ జ్యోతి
22. రామ గుండం        కోరుకంటి చందర్/ కౌషిక్ హరి